స‌ల్మాన్ (X) బ‌న్ని: మైక్ టైస‌న్ బ‌యోపిక్‌?

Update: 2018-09-28 13:30 GMT
ప్ర‌స్తుతం బ‌యోపిక్‌ ల ట్రెండ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా క్రీడాకారుల బ‌యోపిక్‌ ల హ‌వా న‌డుస్తోంది. ఆ క్ర‌మంలోనే ప‌లువురు క్రీడాకారులు - అథ్లెట్‌ ల బ‌యోపిక్‌ లు తెర‌కెక్కించేందుకు మ‌న ఫిలింమేక‌ర్స్ ఏమాత్రం సంకోచించ‌డం లేదు. అయితే ఇండియాలో ది గ్రేట్ మైక్ టైస‌న్ బ‌యోపిక్ తెర‌కెక్కించేందుకు ఆస్కారం ఉందా? అంటే లేక‌పోలేద‌నే చెబుతున్నారు. వాస్త‌వానికి బాక్సింగ్ నేప‌థ్యంలో ఇంత‌వ‌ర‌కూ దేశంలో పెద్ద‌గా బ‌యోపిక్‌ లేం లేవ్‌. అప్ప‌ట్లో ప్రియాంక చోప్రా క‌థానాయికగా తెర‌కెక్కించిన `మేరికోమ్‌` పెద్ద స‌క్సెస్ సాధించింది. అంత‌కుముందు బాక్సింగ్ నేప‌థ్యంలోనే `బ్ర‌ద‌ర్స్‌` అనే హాలీవుడ్ సినిమా స్ఫూర్తితో కిలాడీ అక్ష‌య్‌ కుమార్‌- సిద్ధార్థ్ మ‌ల్హోత్రా క‌థానాయ‌కులుగా అదే టైటిల్‌ తో ఓ సినిమా తెర‌కెక్కింది. అయితే అది బాక్సాఫీస్ వ‌ద్ద ఆశించిన విజ‌యం సాధించ‌లేదు.

అందుకే కిక్ బాక్సింగ్ నేప‌థ్యంలో భారీ చిత్రాలు తెర‌కెక్కేందుకు మునుముందు ఆస్కారం ఉంటుంద‌న‌డంలో సందేహం లేదు. అయితే ప్ర‌పంచ బాక్సింగ్ ఛాంపియ‌న్‌ గా .. ఎదురేలేని మ‌హాబ‌లుడిగా ద‌శాబ్ధాల పాటు రాజ్య‌మేలిన మైక్ టైస‌న్ జీవిత‌క‌థ‌ను వెండితెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేస్తే టాలీవుడ్ - బాలీవుడ్ నుంచి ఏ హీరోలు సూట‌బుల్‌? అని వెతికితే బాలీవుడ్ నుంచి స‌ల్మాన్ ఖాన్ - టాలీవుడ్ నుంచి అల్లు అర్జున్ పేర్ల‌ను అభిమానులు స‌జెస్ట్ చేస్తున్నారు. ఆ ఇద్ద‌రి భీక‌రాకారాలు ఈ మేటి బాక్స‌ర్ లుక్‌ కి సూట‌బుల్‌. ఆ ఫిజిక్‌ - ప‌ర్స‌నాలిటీ స‌ల్మాన్ - బ‌న్నిల‌కు ఉంద‌న‌డంలో సందేహం లేదు. ఒక‌వేళ అలాంటి ప్ర‌య‌త్నం సాగితే అటు స‌ల్మాన్ మాటేమో కానీ బ‌న్ని లాంటి హీరోకి ఇమేజ్ ఇంట‌ర్నేష‌న‌ల్ అప్పీల్ ఆపాదించ‌బ‌డుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఇన్నాళ్లు బ‌న్ని ఇమేజ్ కొన్ని రెజియ‌న్ల‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యి ఉంది. దీనిని స్థాయి పెంచుకునేందుకు ఇలాంటి ఓ అంత‌ర్జాతీయ ఆట‌గాడి బ‌యోపిక్ స‌హ‌క‌రిస్తుంద‌న‌డంలో డౌట్ అఖ్క‌ర్లేదు.

అదంతా స‌రే.. అస‌లు మైక్ టైస‌న్‌ కి ఇండియాలో ఫ్రెండు ఎవ‌రైనా ఉన్నారా? అంటే .. అత‌డు కండ‌ల‌ టైస‌న్ స‌ల్మాన్ ఖాన్‌నే అని తెలుస్తోంది. అందుకే నేడు ముంబైలో అడుగుపెట్టిన మైక్ టైస‌న్‌ కి ప్ర‌త్యేకించి త‌న వ్య‌క్తిగ‌త బాడీ గార్డుల్ని సెక్యూరిటీగా పంపించాడు. ఆ దృశ్యాలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మైక్ టైస‌న్ మొట్ట‌మొద‌టి సారి ఇండియాలో అడుగుపెట్టాడు. ఇక్క‌డ టైస‌న్ అడుగుపెట్ట‌గానే అత‌డిని అభిమానులు చుట్టుముట్టారు. ఆ క్ర‌మంలోనే స‌ల్మాన్ బాడీ గార్డ్ `సెరా` అత‌డిని కార్‌ లో ఎక్కించుకుని వెళ్లాడు. ప్ర‌స్తుతం టైస‌న్ ముంబై స‌బ‌ర్బ‌న్ ఏరియాలోని ఓ స్టార్ హోట‌ల్లో బ‌స చేశాడు. నేష‌న‌ల్ స్పోర్ట్స్ క్ల‌బ్ సార‌థ్యంలోని `కుమైట్- 1 బాక్సింగ్ లీగ్‌` ప్రారంభోత్స‌వానికి టైస‌న్ విచ్చేశారు. ఇక‌పోతే స‌ల్మాన్ ప్ర‌స్తుతం బిగ్‌ బాస్ కొత్త సీజ‌న్ చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారని, అందువ‌ల్ల టైస‌న్‌ కి సెక్యూరిటీగా మ్యానేజ్ చేయ‌డం కుదిరింద‌ని తెలిపారు. ఇంత‌కీ టైస‌న్ బ‌యోపిక్‌ లో స‌ల్మాన్ కానీ, బ‌న్ని కానీ న‌టిస్తారా? అన్న‌దానికి కాల‌మే స‌మాధానం చెప్పాల్సి ఉంటుంది. బ‌న్ని లాంటి స్టార్ హీరో త‌న మార్కెట్ రేంజుని జాతీయ స్థాయిలో విస్త‌రించే ప్ర‌ణాళిక‌లో ఉన్న నేప‌థ్యంలో అత‌డికి టైస‌న్ జీవిత‌క‌థ‌లో న‌టించే అవ‌కాశం వ‌స్తే అది ల‌క్కీ ఛాన్స్ అవుతుందేమో!!  మైక్ టైస‌న్‌కి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న కోటానుకోట్ల అభిమానుల క‌ళ్ల‌లో బ‌న్ని ప‌డే ఛాన్సుంటుంది. అందులో నో డౌట్‌.
Tags:    

Similar News