'లైగర్' సెట్ లో టైసన్.. లెజండరీ బాక్సర్ తో విజయ్ దేవరకొండ..!

Update: 2021-11-16 06:05 GMT
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ ''లైగర్'' సినిమాతో మొట్ట మొదటిసారిగా ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించబోతున్నారనే సంగతి తెలిసిందే. డేషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ లో టైసన్ కీలకమైన పవర్ ఫుల్ పాత్ర పోషిస్తున్నారు.

లెజెండర మైక్ టైసన్ మరియు లైగర్ విజయ్ దేవరకొండ పాల్గొనే కీలక సన్నివేశాలను చిత్రీకరించడానికి చిత్ర బృందం ప్రస్తుతం యూఎస్ఏలో ఉంది. ఈరోజు ప్రారంభమైన ఈ షూటింగ్ షెడ్యూల్ లో ముఖ్యమైన సన్నివేశాలను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ టైసన్ - విజయ్ ల క్యాండీడ్ పిక్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు.

ఈ ఫోటోలో విజయ్ - టైసన్ నవ్వుతూ కనిపిస్తారు. 'లైగర్' సినిమాలో ఇద్దరూ ఇంటెన్స్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రేపు స్క్రీన్ మీద కచ్చితంగా ఫైర్ పుట్టించబోతున్నారని సినీ అభిమానులు భావిస్తున్నారు. "లైగర్ యుఎస్ఏ షెడ్యూల్ బిగిన్ అయింది. ఆపై వారిద్దరూ ఫేస్ టూ ఫేస్ కలుసుకున్నారు. ఆబ్సల్యూట్ ఫైర్. ది లెజెండ్ vs లైగర్'' చిత్ర బృందం ట్వీట్ చేసింది.

ప్రపంచ బాక్సింగ్ చరిత్రలో సంచలనంగా పిలవబడే మైక్ టైసన్.. తన పంచ్ లతో ప్రత్యర్ధులను మట్టికరిపించి ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. అద్భుతమైన పరాక్రమానికి పేరుగాంచిన మైక్ టైసన్.. ఇప్పుడు యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ తో కలిసి నటిస్తుండటంతో 'లైగర్' సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లైగర్' చిత్రంలో విజయ్ దేవరకొండ ప్రొఫెషనల్ బాక్సర్ గా కనిపించనున్నాడు. దీని కోసం శిక్షణ తీసుకోవడమే కాకుండా తీవ్రంగా శ్రమించారు. పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్స్ మీద పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ - కరణ్ జోహార్ మరియు అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ నిర్మిస్తున్నారు.

ఈ క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో ది గ్రేట్ మైక్ టైసన్ కూడా భాగం అయినందున నిర్మాతలు 'లైగర్' ను భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. ఇందులో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. రమ్య కృష్ణ - రోనిత్ రాయ్ - విషు రెడ్డి - అలీ - మకరంద్ దేశ్ పాండే మరియు గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు.

'లైగర్' చిత్రానికి విష్ణు శర్మ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. థాయ్లాండ్ కు చెందిన కెచా స్టంట్ డైరెక్టర్ గా.. జానీ షేక్ బాషా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. 2022 ప్రథమార్థంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
Tags:    

Similar News