SSMB28 నుంచి మైండ్ బ్లోయింగ్ స‌ర్ ప్రైజ్‌?

Update: 2022-06-20 16:30 GMT
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు రీసెంట్ గా `స‌ర్కారు వారి పాట‌` మూవీతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన విష‌యం తెలిసిందే. ప‌ర‌శురామ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని రాబ‌ట్ట‌లేక‌పోయింది. తొలి రోజు తొలి షో నుంచే మిక్స్డ్ టాక్ ని సొంతం చేసుకోవ‌డం తో ఫ్యాన్స్ తీవ్ర నిరాశ‌కు గుర‌య్యారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ , 14 ప్ల‌స్ రీల్స్ తో క‌లిసి జీఎంబీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద‌ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. దీంతో ఫ్యాన్స్ మ‌హేష్ త‌దుప‌రి మూవీపై అంచ‌నాలు పెట్టుకుంటున్నారు.

ఈ మూవీ త‌రువాత మాట‌ల మాంత్రికుడు త్ర‌విక్ర‌మ్ డైరెక్ష‌న్ లో మహేష్ బాబు SSMB28 అనే వ‌ర్కింగ్ టైటిల్ లో రూపొంద‌నున్న మూవీలో న‌టించ‌నున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో `ఖ‌లేజా` త‌రువాత దాదాపు 12 ఏళ్ల విరామం అనంత‌రం ఈ మూవీ లెర‌పైకి రాబోతోంది. దీంతో ఈ మూవీని ద‌ర్వ‌కుడ త్రివిక్ర‌మ్‌, నిర్మాత ఎస్‌. రాధాకృష్ణ చాలా ప్ర‌త్యేకంగా చూస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఎస్‌. రాధాకృష్ణ ఈ మూవీని భారీ బ‌డ్జెట్ తో నిర్మించ‌బోతున్నారు.

ఇందులో మహేష్ కు జోడీగా బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేని ఫైన‌ల్ చేశారు కూడా. ఇటీవ‌ల జ‌రిగిన ముహూర్త‌పు కార్య‌క్ర‌మంలో పూజా హెగ్డే కూడా పాల్గోంది. జూలై నుంచి ప‌ట్టాలెక్క‌నున్న ఈమూవీకి సంబంధించి ప్ర‌తీసారి ఓ ప్ర‌త్యేక అప్ డేట్ బ‌య‌టికి వ‌చ్చేస్తూ ఫ్యాన్స్ ని స‌ర్ ప్రైజ్ చేస్తోంది. ఇటీవ‌లే జ‌ర్మ‌నీ వెళ్లిన ద‌ర్శ‌కుడు త్ర‌విక్ర‌మ్ ఫైన‌ల్ స్క్రిప్ట్ ని ఓకే చేయించుకుని హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశారు. షూటింగ్ షెడ్యూల్ కి సంబందించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో పూర్తిగా బిజీ అయిపోయారు.

ప్ర‌స్తుతం ఇట‌లీలో వున్న హీరో మ‌హేష్ త్వ‌ర‌లోనే వెకేష‌న్ ని కంప్లీట్ చేసుకుని ఫ్యామిలీతో క‌లిసి హైద‌రాబాద్ రాబోతున్నారు. ఆ వెంట‌నే జూలై రెండ‌వ వారం నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ప్రారంభించ‌బోతున్నారని వార్త‌లు వినిపిస్తున్న విష‌యం తెలిసిందే.

తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన స‌ర్ ప్రైజింగ్ అప్ డేట్ అంటూ ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. సినిమాలో మ‌హేష్ డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌బోతున్నార‌ని, మూవీ ఓ పీరియాడిక్ స్టోరీ అని తెలుస్తోంది.

అంతే కాకుండా ఈ మూవీలోని సెకండ్ హాఫ్ లో వ‌చ్చే మ‌హేష్ పాత్ర సినిమాకు ప్ర‌ధాన హైలైట్ గా నిలుస్తుంద‌ని, ఫ్యాన్స్ కి పూన‌కాలు రావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఓ భారీ ఫైట్ లో ప్రారంభించ‌బోతున్నార‌ని, దీనికి రామ్ ల‌క్ష్మ‌ణ్ నేతృత్వం వ‌హించ‌నున్నార‌ని, ఇందు కోసం ఇప్ప‌డ‌కే భారీ స్కెచ్ ని సిద్ధం చేశార‌ని ఇన్ సైడ్ టాక్‌.

ఈ మూవీకి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల్ని చిత్ర బృందం త్వ‌ర‌లోనే వెల్ల‌డించే అవకాశం వుంద‌ని తెలిసింది. ఈ మూవీకి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.
Tags:    

Similar News