మినీ రివ్యూ : 'త‌ల్లుమాల‌'

Update: 2022-09-13 09:02 GMT
న‌టీన‌టులు టివినో థామ‌స్‌, క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్‌, షిన్ టాయ్ చాకో, 'విక్ర‌మ్‌' ఫేమ్ చెంబ‌న్ వినోద్ జోస్ త‌దిత‌రులు న‌టించారు.
డైరెక్ట‌ర్: ఖాలీద్ రెహ‌మాన్‌
నిర్మాత : అషిక్ ఉస్మాన్          
సంగీతం : విష్ణు విజ‌య్‌
సినిమాటోగ్ర‌ఫీ :  జిమ్షీ ఖ‌లీద్‌
ప్రొడ‌క్ష‌న్ హౌస్ : అషిక్ ఉస్మాన్ ప్రొడ‌క్ష‌న్స్‌, ప్లాన్ బి మోష‌న్ పిక్చ‌ర్స్‌
స్ట్రీమింగ్:  నెట్ ఫ్లిక్స్‌

ధ‌నుష్ న‌టించిన త‌మిళ మూవీ 'మారి 2'లో విల‌న్ గా, 'ఫోరెన్సిక్‌', 'మిన్నాల్ ముర‌ళీ' వంటి సినిమాల్లో హీరోగా న‌టించిన అనువాద సినిమాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల్లోనూ మంచి గుర్తింపుని సొంతం చేసుకున్న మ‌ల‌యాళ హీరో టివినో థామ‌స్‌. విభిన్న‌మైన సినిమాల‌తో హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నాడు. టివిరో థామ‌స్ న‌టించిన లేటెస్ట్ మ‌ల‌యాళ మూవీ 'త‌ల్లుమాల‌'. మ‌ల‌యాళంలో సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుని రూ. 100 కోట్లు వ‌సూలు చేసింది. ఈ మూవీ ప్ర‌స్తుతం పాపుల ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. మ‌ల‌యాళ వెర్ష‌న్ తో పాటు తెలుగు వెర్ష‌న్ కూడా స్ట్రీమింగ్ అవుతుండ‌టం విశేషం.

క‌థ‌:

వాజిమ్ (టివినో థామ‌స్‌) ఓ ఆక‌తాయి.. నిత్యం గొడ‌వ‌ల్లో వుంటుంటాడు. పాపుల‌ర్ వ్లాగ‌ర్ ఫాతిమా బీపాతు బీవీ (క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్‌)తో వాజిమ్ పెళ్లి నిశ్చ‌యం అవుతుంది. ఈ సంద‌ర్భంగా వాజీవ్ చేసిన  గొడ‌వకు సంబంధించిన వీడియో ఇంట‌ర్నెట్ లో వైర‌ల్ అవుతుంది. దీంతో వాజిమ్ సెల‌బ్రిటీ అవుతాడు. దీని కార‌ణంగా వాజీమ్ కు ఎంతో మంది స్నేహితుల‌వుతారు. ఆ త‌రువాత అత‌ని జీవితంలో అనుకోని సంఘ‌ట‌న‌లు ఎదుర‌వుతాయి. వ్లాగ‌ర్ ఫాతిమా బీపాతు బీవీతో ప్రేమ పెళ్లి, ఎస్ ఐ రెజీతో ఘ‌ర్ష‌ణ వాజీవ్ జీవితాన్ని మ‌లుపు తిప్పుతాయి. వాజీమ్ వ్లాగ‌ర్ ఫాతిమా బీపాతు బీవీని పెళ్లి చేసుకున్నాడా?.. ఎస్ ఐ రెజీతో వున్న వైరం ఎలా ముగిసింద‌న్న‌దే అస‌లు క‌థ‌.

క‌థ విశ్లేష‌ణ‌:

'త‌ల్లుమాల‌' ఓ సాధార‌ణ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్‌. కానీ దాన్ని అసాధార‌ణ సినిమాగా మ‌ల‌చ‌డంలో ద‌ర్శ‌కుడు ఎడిటింగ్ ని ప్ర‌ధాన బ‌లంగా వాడుకుని సినిమాని ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా నిడిపించే ప్ర‌య‌త్నం చేశాడు. 'త‌ల్లు మాల‌'కు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచింది ఎడిటింగ్ . ద‌ర్శ‌కుడు ఓ సాధార‌ణ క‌థ‌ని అసాధ‌ర‌ణ రీతిలో తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. క్లైమాక్స్ స‌న్నివేశంతో సినిమాని ప్రారంభించి ఫ్లాష్ బ్యాక్ లోకి తీసుకెళ్ల‌డం.. పార్ట్ లు పార్ట్ లు గా మారి దేనిక‌దే ప్ర‌త్యేక‌త‌తో సాగ‌డం, ఎన‌ర్జిటిక్ అంశాల స‌మాహారంగా యువ‌త‌కు న‌చ్చే యాక్ష‌న్ ఘ‌ట్టాల‌తో సినిమాని న‌డిపించ‌డం, స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సినిమాని ఆద్యంతం ర‌క్తిక‌ట్టించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఎక్క‌డా ప‌ట్టుత‌గ్గ‌కుండా నేటి యువ‌త‌కు న‌చ్చే అంశాల‌తో వినోద‌భ‌రితంగా తెర‌కెక్కించిన తీరు ఆక‌ట్టుకుంటుంది. ఇదే మ‌ల‌యాళ ప్రేక్ష‌కులు ఈ మూవీకి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టేలా చేసింది.

ఇంట‌ర్వెల్ బ్యాంగ్ సూప‌ర్ అనిపిస్తుంది. అయితే ఇంత ప‌ట్టుస‌డ‌ల‌ని టెంపోతో సాగిన ఈ మూవీలో క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ - టివినో థామ‌స్ ల మ‌ధ్య సాగే ల‌వ్ ట్రాక్ పై కొంత డ్రాబ్యాక్ గా మారింది. దీనిపై ద‌ర్శ‌కుడు మ‌రింతగా శ్ర‌ద్ధ పెడితే బాగుండేది. ఇక సాంగ్స్ కూడా కొంత ఇబ్బందిక‌రంగా మారాయి. సీరియ‌స్ టెంపోతో సాగుతున్న సినిమాకు బ్యాక్ టు బ్యాక్ వ‌చ్చే సాంగ్స్ స్పీడ్ బ్రేక‌ర్స్ గా మారి విసుగుతెప్పిస్తాయి. అయితే చివ‌రి 30 నిమిషాల్లో టెన్ష‌న్ కు గురిచేస్తూ ద‌ర్శ‌కుడు క‌థ‌ను న‌డిపించిన తీరు మాత్రం శ‌భాష్ అనకుండా వుండ‌లేం.

న‌టీన‌టుల న‌ట‌న :

వాజీమ్ పాత్ర‌లో టివినో థామ‌స్ అద్భుతంగా న‌టించాడు. ఎన‌ర్జిటిక్ పాత్ర‌లో క‌నిపించి త‌న పాత్ర‌కు పూర్తి న్యాయం చేశాడు. ఇక ఎస్‌.ఐ పాత్ర‌లో న‌టించిన షిన్ టాయ్ చాకో, టివినో థామ‌స్ పోటా పోటీగా న‌టించి రెచ్చిపోయారు. ఇద్ద‌రి మ‌ద్య వ‌చ్చే సీన్ లు ప్ర‌ధాన హైలైట్ గా నిలిచాయి. క‌ల్యాణీ ప్రియ‌ద‌ర్శ‌న్ త‌న ప‌రిథి మేర‌కు న‌టించింది. ఇత‌ర పాత్ర‌ల‌లో న‌టించిన న‌టీన‌టులు కూడా త‌మ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించి ఆక‌ట్టుకున్నారు.

యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీకి విష్ణు విజ‌య్ అందించిన సంగీతం, నేప‌థ్య సంగీతం ప్ల‌స్ గా నిలిచింది. అంతే కాకుండా ఫైట్ మాస్ట‌ర్స్ కూడా యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని మ‌ల‌చ‌డంలో త‌మ ప్ర‌త‌భ‌ని క‌న‌బ‌రిచారు. జిమ్షీ ఖ‌లీద్ సినిమాటోగ్ర‌ఫీ, నిషాద్ యూసుఫ్ ఎడిటింగ్ సినిమాకు ప్ర‌ధాన బ‌లంగా నిలిచాయి. ఇంటెన్స్ యాక్ష‌న్ డ్రామాగా తెర‌కెక్కిన ఈ మూవీ ఖ‌చ్చితంగా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News