నితిన్ సరసన ‘చిన్నదాన నీకోసం’ సినిమాలో కథానాయికగా మిస్తీ చక్రవర్తి గుర్తుందా? ఆ సినిమా హిట్టవకపోవడంతో ఆమె టాలీవుడ్లో బిజీ కాలేకపోయింది. మధ్యలో ‘బాబు బాగా బిజీ’ అనే సినిమాలో మెరిసిన ఈ బెంగాలీ భామ.. ‘శరభ’ అనే మరో చిన్న సినిమాలోనూ నటించింది. కానీ ఇవేవీ కూడా మిస్తీ రాత మార్చినట్లుగా లేవు. తన సొంత భాష బెంగాలీలోనే సినిమాలు చేసుకుంటున్న మిస్తీ.. అప్పుడప్పుడు బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఆమెకు తాజాగా బాలీవుడ్లో ఒక మంచి ఛాన్స్ వచ్చింది. మన జాగర్లమూడి క్రిష్ తీస్తున్న ‘మణికర్ణిక’లో మిస్తీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. క్రిష్ ఆమె టాలెంటును గుర్తించి ఈ చిత్రంలో నటనకు మంచి స్కోప్ ఉన్న రోల్ ఇచ్చాడట. ఈ పాత్ర తన కెరీర్ ను మలుపు తిప్పుతుందని మిస్తీ ఆశిస్తోంది.
ఝాన్సీ లక్ష్మీభాయి కథ ఆధారంగా కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో క్రిష్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. లేడీ ఓరియెంటెడ్ మూవీనే అయినప్పటికీ దీనిపై భారీ బడ్జెట్ పెట్టారు. ఏమాత్రం రాజీ లేకుండా సినిమాను నిర్మించారు. ఈ చిత్రం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ చిత్రాన్ని వేసవిలోనే రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ.. కుదరలేదు. షూటింగ్ ఆలస్యమవడంతో ఆగస్టు లేదా సెప్టెంబరులో ‘మణికర్ణిక’ను రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈ చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ స్క్రిప్టు సమకూర్చడం విశేషం. ఇంతకుముందు ‘ఠాగూర్’ రీమేక్ ‘గబ్బర్’ను డైరెక్ట్ చేసిన క్రిష్ కు ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. కానీ ఈసారి ఓ మెగా ప్రాజెక్టును చేతుల్లోకి తీసుకుని కష్టపడ్డాడు క్రిష్. ఈ చిత్రం కచ్చితంగా బాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ ఇస్తుందని అతను ఆశిస్తున్నాడు. ప్రస్తుతం క్రిష్ బాలయ్యతో ఎన్టీఆర్ బయోపిక్ తీస్తున్న సంగతి తెలిసిందే.