వేదిక ఏదైనా క్రియేటివిటీతో దూసుకొచ్చే మోడల్స్ కి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సృజనాత్మక ప్రపంచంలో మనుగడ సాగించేందుకు ఇతరులతో తీవ్రమైన పోటీని ఎదుర్కొనేందుకు ప్రతిసారీ ఏదో ఒక మ్యాజిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక అద్భుతమైన మ్యాజిక్ చేసిన మాజీ మిస్సు గురించి యూత్ అదే పనిగా మాట్లాడుకుంటోంది.
ఇంతకీ ఎవరా మాజీ మిస్సు? అంటే..మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు. మిస్ యూనివర్స్ 2022 బ్యూటీ పోటీలకు ఆమె హాజరయ్యారు.. ఈ వేదికపై హర్నాజ్ సంధు ఎమోషన్ ని రగిలించిన తీరు విస్మయం కలిగించింది.
వేదిక దిగువన కళ్లన్నీ తను ధరించిన అందమైన బ్లాక్ గౌన్ పైనే. హర్నాజ్ సంధు సియాషా షిండే రూపొందించిన బ్లాక్ గౌను ధరించి ర్యాంప్ వాక్ చేసింది.ఈ గౌన్ పై మాజీ మిస్ యూనివర్శ్ ల ఫోటోలు హైలైట్ గా కనిపించాయి.
ఇది ఎంతో ఉద్విగ్నమైన క్షణం. సుష్మితా సేన్ -లారా దత్తాలకు వారి కీర్తి కిరీటంలో కలికితురాయిన అనదగ్గ కిరీటాలను అందుకుని ఎందరికో స్ఫూర్తినిచ్చారు. అలాంటి వారికి నివాళిగా ఈ గౌన్ ని రూపొందించాలన్న ఆలోచన అందరి మనసులు దోచింది.
సీనియర్లను జూనియర్లు గౌరవించుకోవడం ఆరాధించడం లేదా వారి నుంచి స్ఫూర్తిని పొందడం అలాగే అభిమానుల్లో నిరంతరం క్రియేటివిటీతో స్ఫూర్తిని నింపడం ఇది ఎంతో గొప్ప చర్య.. హర్నాజ్ కి హ్యాట్సాఫ్!! అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టూపీస్ గౌనులో టోన్-ఆన్-టోన్ సీక్విన్డ్ కాంటూర్ డిజైన్ తో ఫిట్టింగ్ బ్లాక్ గౌనులో హర్నాజ్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా ఆ బ్యాక్ లెస్ డిజైన్ మరింత అందంగా కుదురుకుందనడంలో సందేహం లేదు.హర్నాజ్ సంధు.. ఓగ్ బ్యూటీ క్వీన్స్ కు అద్భుత నివాళిని ఇవ్వడం కన్నలపండుగను తలపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.Full View
ఇంతకీ ఎవరా మాజీ మిస్సు? అంటే..మిస్ యూనివర్స్ 2021 హర్నాజ్ సంధు. మిస్ యూనివర్స్ 2022 బ్యూటీ పోటీలకు ఆమె హాజరయ్యారు.. ఈ వేదికపై హర్నాజ్ సంధు ఎమోషన్ ని రగిలించిన తీరు విస్మయం కలిగించింది.
వేదిక దిగువన కళ్లన్నీ తను ధరించిన అందమైన బ్లాక్ గౌన్ పైనే. హర్నాజ్ సంధు సియాషా షిండే రూపొందించిన బ్లాక్ గౌను ధరించి ర్యాంప్ వాక్ చేసింది.ఈ గౌన్ పై మాజీ మిస్ యూనివర్శ్ ల ఫోటోలు హైలైట్ గా కనిపించాయి.
ఇది ఎంతో ఉద్విగ్నమైన క్షణం. సుష్మితా సేన్ -లారా దత్తాలకు వారి కీర్తి కిరీటంలో కలికితురాయిన అనదగ్గ కిరీటాలను అందుకుని ఎందరికో స్ఫూర్తినిచ్చారు. అలాంటి వారికి నివాళిగా ఈ గౌన్ ని రూపొందించాలన్న ఆలోచన అందరి మనసులు దోచింది.
సీనియర్లను జూనియర్లు గౌరవించుకోవడం ఆరాధించడం లేదా వారి నుంచి స్ఫూర్తిని పొందడం అలాగే అభిమానుల్లో నిరంతరం క్రియేటివిటీతో స్ఫూర్తిని నింపడం ఇది ఎంతో గొప్ప చర్య.. హర్నాజ్ కి హ్యాట్సాఫ్!! అంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టూపీస్ గౌనులో టోన్-ఆన్-టోన్ సీక్విన్డ్ కాంటూర్ డిజైన్ తో ఫిట్టింగ్ బ్లాక్ గౌనులో హర్నాజ్ చాలా ప్రత్యేకంగా కనిపించింది. ముఖ్యంగా ఆ బ్యాక్ లెస్ డిజైన్ మరింత అందంగా కుదురుకుందనడంలో సందేహం లేదు.హర్నాజ్ సంధు.. ఓగ్ బ్యూటీ క్వీన్స్ కు అద్భుత నివాళిని ఇవ్వడం కన్నలపండుగను తలపించిందని అభిమానులు ప్రశంసిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో వైరల్ గా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.