సీతా దేవి పాత్ర కోసం తిండి మానేసింద‌ట‌

Update: 2021-04-20 03:30 GMT
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వంలో ఆదిపురుష్ శ‌ర‌వేగంగా పూర్త‌వుతోంది. రామాయ‌ణం స్ఫూర్తితో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో డార్లింగ్ ప్ర‌భాస్ శ్రీ‌రాముడిగా న‌టిస్తుండ‌గా.. సైఫ్ అలీఖాన్ లంకేయుడిగా క‌నిపించ‌నున్నారు. అలాగే స‌న్నీసింగ్ ల‌క్ష్మ‌ణుడిగా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఇక ఈ చిత్రంలో సీతా దేవి పాత్ర‌లో 1-నేనొక్క‌డినే బ్యూటీ కృతి స‌నోన్ న‌టిస్తోంది. ఇంత‌కుముందు ద‌ర్శ‌కుడు ఓంరౌత్  ప్ర‌భాస్ హార్డ్ వ‌ర్క్ గురించి సైఫ్ అలీఖాన్ తో ప‌ని తీరు గురించి ప్ర‌శంస‌లు కురిపించారు. ఆ ఇద్ద‌రూ ఈ సినిమాని మ‌రో లెవ‌ల్ కి తీసుకెళ్లేందుకు ఎంత‌గానో శ్ర‌మిస్తున్నార‌ని అన్నారు.

ఇప్పుడు కృతి గురించిన ఆస‌క్తిక‌ర విష‌యాన్ని ఓంరౌత్ మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ కోసం కృతి తనను తాను ఎలా మ‌లుచుకుంటోందో కూడా ఇన్న‌ర్ విష‌యాన్ని వెల్ల‌డించారు.

కృతి సనోన్ త‌న‌కు తానుగా తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకునేందుకు నిపుణుడైన కోచ్ ని నియ‌మించుకుని భాషకు సంబంధించిన‌ శిక్షణ తీసుకోవడం ప్రారంభించారని ఓం రౌత్ తెలిపారు. ఈ చిత్రంలో సీత పాత్ర‌కు చాలా డైలాగులు ఉంటాయి. అందుకే తనంతట తానుగా డబ్ చేయడానికి సిద్ధమవుతోంది. అదే సమయంలో కృతి సనోన్ సీత ఆహార్యం కోసం ఆ రూపం కోసం చాలానే శ్ర‌మిస్తోంది. అంత‌కుమించి త్యాగాలు చేస్తోంది. స్లిమ్ లుక్ కోసం తిండి కూడా క‌ట్టేసింద‌ట‌. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని బృందం లక్ష్యంగా పెట్టుకుంది.
Tags:    

Similar News