చరణ్ సత్తా చాటాల్సిన టైం ఇది..!

అఫ్కోర్స్ అది రాజమౌళి సినిమానే కానీ రామరాజు పాత్రలో చరణ్ ది బెస్ట్ అందించాడు.

Update: 2025-01-10 03:50 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పదేళ్ల క్రితమే బాలీవుడ్ లో ఒక అటెంప్ట్ చేశాడు. జంజీర్ అంటూ సూపర్ హిట్ సినిమా రీమేక్ చేయగా అది కాస్త డిజాస్టర్ గా నిలిచింది. ఐతే అప్పుడు చరణ్ ని చూసి నవ్విన వాళ్లని ఆర్.ఆర్.ఆర్ లో రామరాజు పాత్రలో తన పర్ఫార్మెన్స్ తో షాక్ అయ్యేలా చేశాడు రామ్ చరణ్. అఫ్కోర్స్ అది రాజమౌళి సినిమానే కానీ రామరాజు పాత్రలో చరణ్ ది బెస్ట్ అందించాడు. సినిమా కోసం రాం చరణ్ పడే కష్టం ఎలాంటిదో అర్ధమయ్యేలా చేసింది.

ఐతే RRR తో పాన్ ఇండియా హిట్ అందుకున్న చరణ్ ఆ తర్వాత సినిమా ఆచార్య కేవలం తెలుగులోనే వదిలారు. ఐతే ఆ సినిమా నిరాశపరచగా ఇప్పుడు గేమ్ ఛేంజర్ గా మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు. ముఖ్యంగా RRR తర్వాత ఎన్టీఆర్ కూడా దేవర సినిమాతో పాన్ ఇండియా అటెంప్ట్ చేశాడు. తెలుగులో సక్సెస్ అనిపించుకున్న దేవర హిందీ ఆడియన్స్ లో అంత బజ్ క్రియేట్ చేయలేకపోయింది. దేవర తర్వాత ఇప్పుడు రాం చరణ్ గేమ్ ఛేంజర్ నేషనల్ ఆడియన్స్ ముందుకు వస్తుంది.

ఈ సినిమా తో చరణ్ అయినా సక్సెస్ కొడతాడా లేదా అన్న టెన్షన్ మొదలైంది. మెగా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా మీద చాలా అంచనాలతో ఉన్నాడు. శంకర్ సినిమా అంటే సోషల్ మెసేజ్ ని కమర్షియల్ పంథాలో చెబుతాడు. అంతేకాదు తెర మీద విజువల్స్ తో అబ్బురపరుస్తాడు. గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా సాంగ్స్ కోసమే 75 కోట్ల దాకా ఖర్చు పెట్టారంటే తెర మీద ఆ గ్రాండియర్ ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

గేమ్ ఛేంజర్ సినిమాపై పాన్ ఇండియా లెవెల్ లో ఆశించిన బజ్ లేకపోయినా సినిమా రిలీజ్ తర్వాత హిట్ టాక్ వస్తే మాత్రం తప్పకుండా వసూళ్లు అదిరిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈమధ్యనే పుష్ప 2 లాంటి మాస్ ఫీస్ట్ తో బీ టౌన్ ఆడియన్స్ ఫిదా అవ్వగా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ కూడా వాళ్ల అంచనాలను అందుకుంటాడా లేదా అన్నది చూడాలి. గేం ఛేంజర్ సినిమాకు కియరా అద్వానీ గ్లామర్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచేలా ఉందని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ కూడా సినిమాకు మరో హైలెట్ అనేస్తున్నారు.

Tags:    

Similar News