మిస్టర్.. మళ్లీ ముకుంద డేట్ కే ఫిక్స్

Update: 2016-07-23 05:36 GMT
మెగా హీరో వరుణ్ తేజ్ చాలా నెలలు గ్యాప్ తీసుకుని సినిమా స్టార్ట్ చేశాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న మిస్టర్ మూవీని ప్రస్తుతం స్పెయిన్ లో చిత్రీకరిస్తున్నారు. దాదాపు నెలన్నరకు పైగా ఇక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుండగా.. ఆ తర్వాత హైద్రాబాద్ లో షూటింగ్ జరిపేందుకు ప్లాన్ చేశారు.

ఇప్పుడీ మిస్టర్ కి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసేశారని తెలుస్తోంది. క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 23న మిస్టర్ మూవీని విడుదల చేయాలని నిర్ణయించాడు దర్శకుడు శ్రీను వైట్ల నిర్ణయించాడు. ఇందుకు అనుగుణంగానే షెడ్యూల్స్.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపట్టేలా ప్లాన్ చేశారని తెలుస్తోంది. గతేడాది కూడా క్రిస్మస్ సమయంలోనే లోఫర్ అంటూ వచ్చాడు వరుణ్ తేజ్. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర క్లిక్ కాలేదు. కానీ వరుణ్ తేజ్ లాంఛింగ్ మూవీ రెండేళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది.

డిసెంబర్ 23.. 2014న ముకుందతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన వరుణ్ తేజ్.. చకచకా 3 సినిమాలు రిలీజ్ చేసేశాడు. మళ్లీ రెండేళ్ల తర్వాత తొలిసినిమా రిలీజ్ అయిన తేదీనే.. తన సినిమాని రిలీజ్ చేయాలని నిర్ణయించడం విశేషం. మిస్టర్ నిర్మాతలు కూడా ముకుందని నిర్మించినవారే కావడం మరో హైలైట్.
Tags:    

Similar News