మిస్ట‌ర్.. తేడా వ‌స్తే అంతే సంగ‌తులు

Update: 2017-04-13 13:39 GMT
ఒక ద‌ర్శ‌కుడికి వ‌రుస‌గా రెండు ఫ్లాపులు రావ‌డం పెద్ద విష‌య‌మేమీ కాదు. టాలీవుడ్లో అలాంటి ద‌ర్శ‌కులు చాలామంది ఉన్నారు. ఎంద‌రో స్టార్ డైరెక్ట‌ర్లు రెండేంటి.. వ‌రుస‌గా చాలా ఫ్లాపులే తిన్నారు. కానీ శ్రీను వైట్ల మాత్రం కేవ‌లం రెండే రెండు ఫ్లాపుల‌తో శిఖ‌రం నుంచి పాతాళానికి ప‌డిపోయాడు. ‘ఆగ‌డు’.. ‘బ్రూస్ లీ’ సినిమాలు అత‌డికి తెచ్చిన చెడ్డ పేరు అంతా ఇంతా కాదు. ఒకే ఫార్ములాను ప‌ట్టుకుని మ‌ళ్లీ మ‌ళ్లీ అదే సినిమాలు తీయ‌డం.. ఆగ‌డు లాంటి డిజాస్ట‌ర్ త‌ర్వాత కూడా ఏమీ మార‌కుండా బ్రూస్ లీలోనూ మ‌ళ్లీ అదే ఫార్ములాతో క‌థ న‌డిపించ‌డంతో ప్రేక్ష‌కుల‌కు అత‌డి మీద ఎక్క‌డ‌లేని కోపం వ‌చ్చేసింది. అందుకే ‘బ్రూస్ లీ’కి అలాంటి ఫ‌లితం వ‌చ్చింది.

‘బ్రూస్ లీ’ దెబ్బ‌కు వైట్ల కెరీర్లో ఎన్న‌డూ లేనంత గ్యాప్ వ‌చ్చింది. పైగా స్టార్ల‌తో కాకుండా ఈసారి వ‌రుణ్ తేజ్ తో స‌ర్దుకుపోవాల్సి వ‌చ్చింది. ఇప్పుడు ‘మిస్ట‌ర్‌’తో అత‌నేంటో నిరూపించుకోవాల్సి ఉంది. ఈ సినిమా వైట్ల‌కు మామూలు ప‌రీక్ష కాదు. అగ్ని ప‌రీక్షే. ఈ సినిమా తేడా వ‌స్తే వైట్ల కెరీర్ ఎలా ఉంటుందో అంచ‌నా వేయ‌డం క‌ష్టం. సినిమా ఫ‌లితం సంగ‌త‌లా ఉంచితే.. వైట్ల త‌న ఫార్ములా క‌థ‌లు.. కామెడీల ట్రాకుల నుంచి బ‌య‌టికి వ‌చ్చాడా లేదా అన్న‌ది కీల‌కం. మ‌ళ్లీ పాత సినిమాల ఛాయ‌లు క‌నిపించాయంటే వైట్ల కెరీర్ పై చాలా ప్ర‌భావం ప‌డుతుంది. మ‌రోవైపు అస‌లే క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కోసం ఆరాట‌ప‌డుతున్న టైంలో ‘లోఫ‌ర్‌ తో గ‌ట్టి ఎదురుదెబ్బ తిన్నాడు వ‌రుణ్‌. అత‌డికి కూడా మిస్ట‌ర్ హిట్ట‌వ‌డం కీల‌కం. మ‌రి శుక్ర‌వారం రాబోతున్న ఈ సినిమా ఎలాంటి ఫ‌లితాన్నందుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News