పెద్ద సినిమాలకు భారీ నష్టాలు వచ్చినపుడు నిర్మాతలు బయ్యర్లకు కొంత డబ్బులు వెనక్కివ్వడం అప్పుడప్పుడూ జరుగుతుంటుంది. కొన్నిసార్లు హీరోలు.. దర్శకులు సైతం తమ పారితోషకాల్లోంచి కొంత మొత్తం వెనక్కిస్తుంటారు. ఇప్పుడు ‘మిస్టర్’ సినిమా విషయంలోనూ అదే జరిగేలా ఉంది. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి).. ఠాగూర్ మధుల ప్రొడక్షన్లో ఇంతకుముందు వచ్చిన ‘విన్నర్’ ఇప్పటికే బయ్యర్లను దెబ్బ కొట్టింది. నిర్మాతలకూ పంచ్ పడింది. ‘మిస్టర్’కు మంచి రిజల్ట్ వస్తే పాత నష్టాలు కొంచెం కవర్ అవుతుందేమో అనుకుంటే.. ఇది మరింత పెద్ద దెబ్బ కొట్టింది. పది కోట్లయినా వసూలు చేయలేదీ చిత్రం. రూ.12-14 కోట్ల దాకా ఈ సినిమా నష్టాన్ని మిగిల్చినట్లు అంచనా.
దీంతో నిర్మాతలు దిక్కు తోచని స్థితిలో పడిపోయారు. బయ్యర్లకు కొంత మేర సెటిల్ చేయక తప్పని పరిస్థితి. సినిమా పరాజయానికి దర్శకుడు శ్రీను వైట్లనే ప్రధాన బాధ్యుడిగా చేస్తున్న నిర్మాతలు.. నష్టాల్ని అతనూ భరించాల్సిందే అంటున్నారట. అతడి పారితోషకంతో పాటు కొంత మొత్తం ఇవ్వాల్సిందే అని.. లేకుంటే తాము బయటపడలేమని.. సినిమాకు ఇష్టానుసారం ఖర్చు పెట్టించి, ఇలాంటి ఫలితం మిగిల్చినందుకు నష్టం భరించాల్సిందే అని నిర్మాతలు పట్టుబడుతున్నారట. వైట్ల కూడా ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన కెరీర్ బాగా ట్రాక్ తప్పేసి ఇంకో సినిమా చేయడమే కష్టంగా మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడీ నష్టాల్ని భరించాల్సి రావడంతో వైట్లకు మామూలు దెబ్బ కాదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/