కౌస‌ల్య ప్రీరిలీజ్ కి మిథాలీ గెస్ట్‌

Update: 2019-06-23 04:58 GMT
క్రికెట్ నేప‌థ్యంలో సినిమా అంటే సాహ‌స‌మే. అయితే అలాంటి సాహ‌సం చేసి మెప్పించారు నాని- గౌత‌మ్ తిన్న‌నూరి బృందం.  ఎమోష‌న్స్ ని.. క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్ ని బ్యాలెన్స్ డ్ గా తెర‌పై ఆవిష్క‌రిస్తూ కొత్త క‌థ‌ని చూపించే ప్ర‌య‌త్నం చేసింది ఈ టీమ్. జెర్సీ క‌మ‌ర్షియ‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ కాక‌పోయినా సేఫ్ జోన్ లోకి చేరింద‌ని ట్రేడ్ విశ్లేషించింది. ఈ చిత్రాన్ని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మించింది.

ప్ర‌స్తుతం మ‌రో క్రికెట్ బ్యాక్ డ్రాప్ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. త‌మిళ చిత్రం `క‌ణ` రీమేక్  గా తెర‌కెక్కిన ఈ సినిమా టైటిల్ `కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి`. ఐశ్వ‌ర్య రాజేష్ టైటిల్ పాత్ర పోషించింది. రాజేంద్ర‌ప్ర‌సాద్‌- కార్తిక్ రాజు- వెన్నెల కిశోర్‌- శివ కార్తికేయ‌న్ కీల‌క పాత్ర‌ధారులు. భీమినేని శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.  జూలైలో ఈ సినిమా రిలీజ్ కానుంది. జూలై 2న ప్రీరిలీజ్ వేడుక‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఈ వేడుక‌కు మిథాలీ రాజ్ ను ముఖ్య అతిధిగా ఆహ్వానిస్తున్నామ‌ని చిత్ర నిర్మాత కె.ఎస్.రామారావు తెలిపారు.

మెగా నిర్మాత కె.ఎస్.రామారావు మాట్లాడుతూ-```కౌస‌ల్యా కృష్ణ‌మూర్తి` చిత్రానికి ఈ నెల 24న సెన్సార్ పూర్త‌వుతోంది. త‌మిళ్‌- హిందీ- మ‌ల‌యాళంలో ఇప్ప‌టికే మంచి పేరు తెచ్చుకున్న తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్ ఇందులో క‌థానాయిక‌గా న‌టించింది. ఐశ్వ‌ర్య‌ తండ్రి రాజేష్ తెలుగులో పెద్ద హీరో. ఆయ‌న తండ్రి అమ‌ర్‌ నాథ్‌ గారు కూడా మంచి హీరో. కామెడీ ఆర్టిస్ట్ శ్రీల‌క్ష్మికి త‌ను మేన‌కోడ‌ల‌వుతుంది. వాస్త‌వానికి విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా క్రాంతి మాధ‌వ్ ద‌ర్శ‌క‌త్వంలో మేం తెర‌కెక్కించే సినిమా కోసం ఐశ్వ‌ర్య‌ని ఎంపిక చేసుకున్నాం. క‌ణ గురించి త‌నే చెప్ప‌డంతో ప్రాజెక్ట్ టేక‌ప్ చేశాం. తండ్రీ కూతుళ్ల అనుబంధం తో పాటు క్రికెట్ గోల్ నేప‌థ్యంలోని సినిమా ఇది. జులై 2న ప్రీ రిలీజ్ వేడుక‌కు మిథాలీరాజ్‌ ను ఆహ్వానిస్తున్నాం`` అని తెలిపారు. ఇది జెర్సీ త‌ర‌హా క‌థాంశ‌మా? అంటే కానేకాద‌ని ఆయ‌న అన్నారు. అయితే జెర్సీ త‌ర్వాత అంత మంచి ఫీల్ గుడ్ చిత్ర‌మ‌వుతుంద‌ని.. ఒక అమ్మాయి క్రికెట‌ర్ గా ఎద‌గాల‌న్న ల‌క్ష్యాన్ని ఎలా చేరుకుంది? అన్న‌ది స్ఫూర్తి నింపుతుంద‌ని కె.ఎస్ రామారావు తెలిపారు. లేడీ క్రికెట‌ర్ జ‌ర్నీ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని అన్నారు.  ప‌ల్లెటూరిలో పుట్టి పెరిగిన అమ్మాయి ఎలా ఎదిగి సిటీల్లో తిరిగి భార‌త‌దేశానికి క్రికెట్‌ లో పేరు తెచ్చిపెట్టింది.. అన్న‌ది ఆస‌క్తిక‌రం. 35 రోజుల్లో మొత్తం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది.  ఇందులో హీరోయిన్ త‌ల్లిగా ఝాన్సీ న‌టించారు. జూలై రెండో వారంలో సినిమా రిలీజ్ చేస్తాం.. అని అన్నారు.


Tags:    

Similar News