విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన 'డియర్ కామ్రేడ్' చిత్రానికి ఆశించిన స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ఈ చిత్రంకు రివ్యూలు బ్యాడ్ గా వచ్చాయి. అయితే ప్రేక్షకుల నుండి మాత్రం మిశ్రమ స్పందన వచ్చింది. విజయ్ దేవరకొండకు ఉన్న క్రేజ్ తో భారీ ఓపెనింగ్స్ ను ఈ చిత్రం రాబడుతోంది. ఇక ఈ చిత్రంలో మంచి మెసేజ్ ను కూడా ఇవ్వడం జరిగింది. అమ్మాయిలు ఎదుర్కొంటున్న లైంగిక వేదింపులను ఈ చిత్రంలో చూపించడం జరిగింది.
ఈ చిత్రంను ప్రముఖ టీం ఇండియా క్రీడాకారిణి మిథాలీ రాజ్ చూడబోతుంది. మహిళ క్రికెటర్స్ కు ఆదర్శంగా నిలిచే మిథాలీ రాజ్ ప్రస్తుతం చిన్న పిల్లల్లో లైంగిక వేదింపులకు సంబంధించిన అవగాహణను కల్పించేందుకు ఒక షోను చేస్తోంది. అందులో భాగంగా పిల్లలతో కలిసి మిథాలీ రాజ్ ఈ చిత్రంను ప్రత్యేక షో చూడబోతుంది. మిథాలీతో పాటు ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన యూకే డిప్యూటీ హై కమీషనర్ ఆండ్రూ కూడా ఈ చిత్రాన్ని చూడబోతున్నారు.
'గీత గోవిందం' చిత్రం తర్వాత విజయ్ దేవరకొండ మరియు రష్మికల జంటకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఆ క్రేజ్ తో ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా వచ్చాయి. సినిమాకు ముందు పలు వేదికల మీద ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు. అంచనాలు బాగా పెంచారు. అయితే అంచనాలను అందుకోలేక పోయినా కలెక్షన్స్ మాత్రం ఒక స్థాయిలో బాగానే వస్తున్నట్లుగా ట్రేడ్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది.