మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికల్లో మంచు విష్ణు ప్రధాన వారియర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ప్రకాష్ రాజ్ తో నువ్వా నేనా? అంటూ విష్ణు ఢీకి దిగారు. అయితే ఇది విష్ణు డాడ్ మంచు మోహన్ బాబుకి ఇష్టం లేదా? అంటే అవుననే తెలుస్తోంది. నాన్న (ఎంబీ) నేను MAA ఎన్నికలలో పోటీ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే ఆయన 46 సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నాడు. పరిశ్రమను విభజించడాన్ని ఎప్పుడూ చూడలేదు `` అని విష్ణు పేర్కొన్నారు.
తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన తర్వాత హీరో విష్ణు మంచు మీడియాతో తన ఆలోచనలను పంచుకున్నారు. కానీ విష్ణు వ్యాఖ్యలు చాలా లోతైన విషయాల్ని చెబుతున్నాయి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) ప్రస్తుత స్థితిని ఎత్తి చూపుతున్నట్టుగా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి. వర్గ విభేధాలను తాను.. తన తండ్రి గారు మోహన్ బాబు సైతం కోరుకోవడం లేదనే భావన వ్యక్తమైంది.
MAA ప్రెసిడెంట్ పాత్ర అనేది ట్యాగ్ కాదు.. బాధ్యత .. నేను దానిని సమర్ధవంతంగా నిర్వహించగలనని నాకు నమ్మకం ఉంది. నా ప్యానెల్ లో ఎవరూ ఎన్నికలు షెడ్యూల్ చేయబడిన విధానంపై సంతోషంగా లేరు.. అని విష్ణు అన్నారు. దివంగత దాసరి నారాయణరావు .. మురళీ మోహన్.. ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ కోసం పోటీ చేయమని విష్ణుని అడిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ``అప్పట్లో నాన్నగారు నన్ను ఆపేశారు. ఎందుకంటే నాకు కొన్ని సినిమాలు ఉన్నాయి. సరైన అనుభవం లేదు. ఇప్పుడు నేను MAA లో చాలా సవాళ్లు ఉన్నాయి. అయినా మార్పును తీసుకురాగలనని నమ్మకంగా చెప్పగలను`` అని విష్ణు అన్నారు. MAA అనేది స్వచ్ఛంద సంస్థ కాదు.. అని అన్నారు. మేము వృద్ధ నటులకు పెన్షన్లు ఇస్తున్నప్పుడు ఛారిటీ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాలి.. అది అసోసియేషన్ సేవ అని అన్నారు.