మోహన్ బాబుకు కోపం వచ్చింది. అది కూడా మీడియా పై. కారణం... సల్మాన్ ఖాన్ పై వరుసగా స్టోరీలు వేస్తుండడమే. భజరంగీ భాయ్ జాన్ బంపర్ హిట్టైన ఆనందంలో ఉన్న సల్లూభాయ్... ముంబై పేలుళ్ల కేసుపై ట్వీట్ చేసి.. అనవసరంగా వివాదంలో ఇరుక్కున్నాడు. విమర్శలు వెల్లువెత్తడంతో నాల్రోజులు పోయాక వివరణ ఇచ్చిన సల్మాన్... వివాదాస్పద ట్వీట్ లను తన ట్విట్టర్ పేజ్ నుంచి తొలగించాడు కూడా.
చేసింది తప్పే పబ్లిగ్గా ఒప్పుకున్నా.. మీడియా మాత్రం సల్మాన్ ఖాన్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. గంటల కొద్దీ ప్రోగ్రాంలు టెలికాస్ట్ చేస్తూనే ఉంది. దీన్ని గమనించిన మోహన్‌బాబుకు మీడియా పై చిర్రెత్తుకొచ్చింది. సల్మాన్ చేసింది తప్పే అయితే.. మన పార్లమెంట్ సభ్యులు చేసింది తప్పు కాదా అంటు ప్రశ్నిస్తున్నారాయన. సల్మాన్ చేసినట్లుగానే... అనేక మంది ఎంపీలు మీడియా సాక్షిగా, మైకులు పట్టుకుని మరీ... యాకూబ్‌కు ఉరిశిక్ష సరికాదంటూ ఊదరగొట్టేశారు. మరి ఎంపీలను పట్టించుకోని మీడియా... సల్మాన్ ఖాన్ ని టార్గెట్ చేయడమేంటంటూ... నిలదీశారు మోహన్ బాబు.
ఇప్పటికైనా మీడియా వాళ్లు, ప్రజలు సల్మాన్ ను వేధించడం మానుకుంటే... రికార్డులు సృష్టిస్తున్న తన సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసేందుకు... కండలవీరుడికి అవకాశముంటుందని హితవు పలికారు. మరి నిజమే కదా.. రాజకీయ నాయకులను నిలదీయలేని మీడియా... సినిమా వాళ్ల వెంట పడ్డం ఎలా కరెక్ట్ అవుతుంది. మొత్తానికి మోహన్ బాబు మంచి పాయింటే పట్టుకున్నారు. మీడియా జవాబు చెప్పలేని ప్రశ్నవేసి... తను డైలాగ్ కింగ్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు.