మూవీ ఆర్టిస్టుల సంఘం (మా) ఎన్నికలు ప్రస్తుతం ఇండస్ట్రీలో సర్వత్రా ఉత్కంఠ పెంచుతున్నాయి. చాలా కాలంగా మా అధ్యక్షులతో ముడిపడిన వివాదాల వల్ల పురోగతి క్షీణించింది. పనులేవీ సవ్యంగా జరగడం లేదు. మా సంక్షేమ కార్యక్రమాలు నీరసించిపోగా ఫండ్ కూడా నెమ్మదిగా కరిగిపోయే పరిస్థితి ఉంది. సొంత భవంతి నిధి సేకరణకు ఇన్నాళ్లు ఏదీ జరగలేదు. దీంతో ఈసారి అధ్యక్ష పదవి చేపట్టబోయే వ్యక్తి ఎవరైనా కానీ ఛరిష్మా వోకల్ కమాండ్ ఉన్న వారైతే బావుంటుందనే అభిప్రాయం నెలకొంది.
ప్రకాష్ రాజ్ .. మంచు విష్ణు మధ్య పోటీ ఉన్నా ఆ ఇరువురి నడుమా వయో భేధం సహా అనుభవ లేమి వంటివి బయటపడుతున్నాయి. ప్రకాష్ రాజ్ వివాద రహితుడు కాదన్న నెగెటివ్ ఒపీనియన్ మెజారిటీ వర్గాల్లో ఉంది. ఇలాంటి సన్నివేశంలో మా అధ్యక్షుడు కాబోయే వ్యక్తికి ఉండాల్సిన కమాండ్ పై చాలా ఆధారపడి ఉంటాయి.
అసలే కరోనా కష్టకాలం.. పేద ఆర్టిస్టులను ఈ కష్టంలో ఆదుకునే నాధుడు కావాలి. ఇప్పుడున్న సన్నివేశంలో మంచు విష్ణు కంటే కూడా మంచు మోహన్ బాబు లాంటి విల్ పవర్.. కమాండ్ ఉన్న కమాండర్ అవసరం అనే అభిప్రాయం బలంగా ఉంది. ఒకవేళ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పోటీబరిలో ఉంటే మెగాస్టార్ చిరంజీవి అండదండలు ఆయనకు స్పష్ఠంగా ఉండేవనే అభిప్రాయం నెలకొంది. ఇప్పుడున్న వివాదాల్ని అణచివేసే ఛరిష్మా ఆయన సొంతం. దాసరి తర్వాత మళ్లీ అంత బలంగా గొంతు వినిపించగల సమర్థుడు ఆయన. వివాదాల్లేకుండా అణచివేసి ముందుకు నడిపే చేవ ఈ దఫా అధ్యక్షుడికి చాలా అవసరం కూడా. చిన్న చిన్న సమస్యల్ని ఈసీ లో గొడవల్ని రానివ్వకుండా పరిష్కరించే మంచి వాక్కు పెద్దరికం ఆయనకు ఉంది. మరి దీనిని పరిగణించి ఆయనను ఎన్నుకునే వీలుందా లేదా? అన్నది చర్చనీయాంశమైంది.