క్లోజ్ అయిపోయాడంటే.. అంతే మరి

Update: 2016-08-22 04:28 GMT
సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుకు ఎవరైనా ఓసారి నచ్చితే ఇక ప్రాణం ఇచ్చేసినంత పని చేసేస్తారు. వారికోసం ఏమైనా చేసేందుకు రెడీ అంటారు మోహన్ బాబు. రీసెంట్ గా వరుణ్ సందేష్-వితికాషేరులు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ వివాహానికి మోహన్ బాబుకు ఆహ్వానం ఉన్నా.. ఇతర పనుల కారణంగా ఆయన పెళ్లికి హాజరు కాలేకపోయారు.

మోహన్ బాబుకు వరుణ్ సందేశ్ తో మంచి అనుబంధం ఉంది. పాండవులు పాండవులు తుమ్మెద చిత్రంతో పాటు.. రీసెంట్ గా మామ మంచు అల్లుడు కంచు చిత్రాల్లో కూడా వీరిద్దరూ కలిసి నటించారు. ఇలా తనతో రెండు సినిమాల్లో నటించిన హీరో పెళ్లి చేసుకోవడం.. దానికి తాను వెళ్లలేకపోవడంపై ఆయన ఫీలయ్యారట. అందుకే ఏ మాత్రం ఆలోచించకుండా తానే హైద్రాబాద్ రాగానే.. వరుణ్ సందేశ్ ఇంటికి వెళ్లారు.

'మోహన్ బాబు సార్ ఇంటికి వచ్చి ఆశీర్వాదాలు ఇచ్చారు. చాలా థాంక్యూ సార్. మీ తరగని ప్రేమకు మరో థ్యాంక్స్' అంటూ ట్వీట్ చేశాడు వరుణ్ సందేష్. కొత్త పెళ్లి జంటను పిలిపించి మాట్లాడ్డం లాంటివి చేయకుండా.. తనే వారింటికి వెల్ళి శుభాకాంక్షలు చెప్పారు మోహన్ బాబు. ఎంతైనా.. ఆయనకు ఒకసారి ఎవరైనా నచ్చితే.. అంతే మరి ఇలాగే అభిమానం కురిపించేస్తారు.
Tags:    

Similar News