త్రిష పుష్కర కాలం నుంచి తెలుగులో సినిమాలు చేస్తోంది. ఇప్పటిదాకా ఒక్క ముక్క తెలుగు నేర్చుకోలేదు. ఏదైనా ఆడియో వేడుకలకు వస్తే నార్త్ ఇండియన్ హీరోయిన్ల లాగా బాగున్నారా అంటూ వయ్యారాలు పోతుంటుంది. ఒక్క త్రిష అని ఏంటి.. చాలామంది పరభాషా హీరోయిన్లు.. క్యారెక్టర్ ఆర్టిస్టుల పరిస్థితి ఇంతే. కానీ మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ మాత్రం తన తొలి తెలుగు సినిమా విషయంలో అస్సలు రాజీ పడలేదు. తనకు వేరొకరితో డబ్బింగ్ చెప్పిస్తానంటే ఒప్పుకోలేదు.
అంత పెద్ద సూపర్ స్టార్ అయి ఉండి.. ఎంతో బిజీ అయి ఉండి కూడా పట్టుబట్టి తెలుగు భాష నేర్చుకున్నారు. తనే స్వయంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఐతే ‘మనమంతా’ టీజర్ రిలీజైనపుడు ఆయన వాయిస్ విషయంలో విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో డబ్బింగ్ ఆర్టిస్టు ద్వారా పని కానిచ్చేద్దామని కూడా దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి భావించాడు. అయినా మోహన్ లాల్ పట్టువదల్లేదు. మళ్లీ కష్టపడ్డారు. పర్ఫెక్షన్ కోసం చాలా టైం తీసుకున్నారు. చివరికి ఆయన వాయిస్ తోనే సినిమా విడుదల కాబోతోంది.
‘మనమంతా’ డబ్బింగ్ కోసమే మోహన్ లాల్ ఏకంగా వారం రోజుల పాటు పని చేశారట. మొత్తం 68 గంటల పాటు ఆయన డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందట. స్వయంగా మోహన్ లాలే ఈ విషయాన్ని వెల్లడించాడు. మామూలుగా ఓ మలయాళ సినిమాకైతే మోహన్ లాల్ ఒక్క పూటలో లేదంటే ఒక్క రోజులో డబ్బింగ్ చెప్పేస్తారు. కానీ ‘మనమంతా’ కోసం వారం రోజులు అన్ని గంటల పాటు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చిందంటే.. యేలేటి ఆయన్ని ఎంతగా టార్చర్ పెట్టేశాడో అర్థం చేసుకోవచ్చు. మోహన్ లాల్ అయినా.. యేలేటి అయినా పర్ఫెక్షన్ కోసం తపించే వ్యక్తులు కాబట్టే అంత టైం పట్టిందని అర్థం చేసుకోవచ్చు. మరి ఈ కష్టానికి రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఈ శుక్రవారం చూసేద్దాం.