ఎన్టీఆర్ సినిమాలో మలయాళ స్టార్ హీరో... నిజమేనా?

Update: 2020-07-05 09:34 GMT
తారక్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కెరీర్లో 30వ చిత్రంగా రానున్న ఈ సినిమా గురించి రోజుకొక రూమర్ వస్తూనే ఉంది. నిన్నటి వరకు మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ గా నటించబోతున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాకుండా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటించబోతున్నాడు అన్నారు. ఇప్పుడు మరో న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. త్రివిక్రమ్ ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఓ సామాజిక అంశాన్ని ప్రస్తావించబోతున్నారట. ఈ నేపథ్యంలో ఓ కీలక పొలిటిషియన్ రోల్ కోసం మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ని తీసుకునే ఆలోచనలో ఉన్నారట.

ఇంతకముందు ఎన్టీఆర్ - మోహన్ లాల్ కాంబోలో వచ్చిన 'జనతా గ్యారేజ్' మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పుడు కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ ని ఈ సినిమాలో నటింపజేయాలని చూస్తున్నారట. అంతేకాకుండా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉందట. అందుకోసం ఒక హీరోయిన్ గా పూజాహెగ్డే ని పరిశీలిస్తున్నారట. మరో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీని తీసుకురావాలని అనుకుంటున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంత అనే విషయం తెలియాలంటే చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ఇచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

కాగా 'అరవింద సమేత వీర రాఘవ' వంటి సక్సెస్ ఫుల్ మూవీ తర్వాత తారక్ - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమాని హారిక అండ్ హాసిని ఎంటర్టైన్మెంట్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ పై రాధాకృష్ణ (చిన్నబాబు) - కళ్యాణ్ రామ్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజానికి ఎప్పుడో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసి.. వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించారు. అయితే కరోనా వచ్చి అన్ని ప్లాన్స్ తారుమారు చేసింది. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో తన పార్ట్ చిత్రీకరణ కంప్లీట్ చేసిన వెంటనే తారక్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశాలున్నాయి.

    

Tags:    

Similar News