మోహన్ లాల్ సినిమాల్లోకి అడుగుపెట్టి పాతకేళ్లు దాటుతోంది. ఈ పాతికేళ్లలో తమిళ సినిమాలు చేశారు.. హిందీలోనూ నటించారు. ఐతే తెలుగులో చేయడానికి మాత్రం కుదర్లేదు. అప్పుడెప్పుడో ప్రియదర్శన్ సినిమా ‘గాండీవం’లో ఓ పాటలో తళుక్కుమన్నారు తప్పితే.. ఓ క్యామియో రోల్ కూడా చేయలేదు. ఐతే ఇన్నేళ్ల తర్వాత ఒకేసారి ఆయన రెండు తెలుగు సినిమాలు ఒప్పుకుని ఆశ్చర్యపరిచారు. చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా.. ఎన్టీఆర్-కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కే మరో సినిమా ఒప్పుకుని వచ్చే ఏడాది టాలీవుడ్లోకి బ్యాంగ్ బ్యాంగ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం చేసుకున్నాడీ మలయాళ సూపర్ స్టార్.
ఐతే భాష తెలియకుండా తెలుగులో నటిస్తే బాగోదనుకున్న మోహన్ లాల్.. మన భాష నేర్చుకునే పనిలో పడ్డారట. తెలుగులోకి డబ్ అయ్యే మలయాళ సినిమాలకు మాటలు రాసే ఓ రచయితను ట్రైనర్ గా పెట్టుకుని మరీ తెలుగు వంటబట్టించుకుంటున్నాడట మోహన్ లాల్. ప్రస్తుతం చంద్రశేఖర్ ఏలేటి సినిమా రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అవుతోంది. ఎన్టీఆర్ సినిమా ఫిబ్రవరిలో మొదలువుతంది. ఈ సినిమాల షూటింగులోకి వచ్చే సమయానికి తెలుగుపై పట్టు సాధించాలని పట్టుదలతో ఉన్నాడు మోహన్ లాల్. అంత పెద్ద స్టార్ అయినప్పటికీ.. ఇలా కమిట్మెంట్ తో తెలుగు నేర్చుకోవాలని నిర్ణయించుకుని కష్టపడుతుండటం మోహన్ లాల్ గొప్పదనాన్ని తెలియజేస్తుంది.