కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్-తమిళ స్టార్ హీరో విశాల్-తెలుగు స్టార్ శ్రీకాంత్-క్యూట్ బ్యూటీ రాశి ఖన్నా-యాపిల్ సుందరి హన్సిక మోత్వానీ ఈ కాంబోలో సినిమా అంటే పేర్లు చూస్తేనే దాని మీద ఆసక్తి కలుగుతుంది. అలాంటిది ఒక థ్రిల్లర్ మూవీ వచ్చిందంటే చూడాలి అనిపించడం సహజం కదా. మలయాళంలో విలన్ పేరుతో వీళ్ళతో ఒక సినిమా వచ్చింది అనే సంగతి చాలా మంది ప్రేక్షకులకు తెలియదు. గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయిన విలన్ కేరళలో భారీ ఓపెనింగ్స్ తో కొత్త రికార్డ్స్ సృష్టించినది. బుక్ మై షోలో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో టాప్ 10లో చోటు దక్కించుకుంది. కానీ దీన్ని తెలుగులో మాత్రం తీసుకురాలేకపోయారు. విశాల్ నటించిన దాదాపు ప్రతి సినిమా మనవాళ్ళు డబ్బింగ్ రూపంలో చూసారు. పైగా శ్రీకాంత్ కూడా ఇందులో విలన్ గా నటించాడు కాబట్టి మార్కెట్ చేసుకోవడానికి సైతం ఈజీగా ఉండేది. కానీ ఎందుకనో ఇది మనదాకా రాలేకపోయింది. తెలుగువాళ్లకు బాగా సుపరిచితులు అయిన రాశి ఖన్నా-హన్సికలు ఎలాగూ ప్లస్ అయ్యేవాళ్ళు
ఇది ఇప్పుడు హిందీ డబ్బింగ్ వెర్షన్ రూపంలో యు ట్యూబ్ లోకి వచ్చేసింది. కేవలం 5 రోజుల్లో 1 కోటి 20 లక్షల(12 మిలియన్లు)వ్యూస్ తో దూసుకుపోతోంది. ఇందులో మోహన్ లాల్ పోలీస్ ఆఫీసర్. ఇతని టీమ్ లో కొత్తగా జాయిన్ అయిన ట్రైనీ పాత్రలో రాశి ఖన్నా నటించింది. మోహన్ లాల్ రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నప్పుడు ఓ ప్రమాదంలో తన కూతురిని కోల్పోతాడు. మరోవైపు డాక్టర్ అయిన విశాల్ ఎవరికి తెలియకుండా సమాజానికి చీడ పురుగుల్లా మారిన యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ని హత్య చేస్తూ ఉంటాడు. ఇతనికి హెల్పర్ గా హన్సిక కనిపిస్తుంది. శ్రీకాంత్ డ్రగ్స్ దందా చేసే మాఫియా డాన్. ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి నడుం బిగిస్తాడు మోహన్ లాల్. షాకింగ్ ఇన్సిడెంట్స్ తర్వాత విస్తుపోయే నిజాలు బయటికి వస్తాయి. మరీ గొప్పగా కాదు కానీ ఎంగేజ్ చేసే తరహాలోనే ఉన్న విలన్ మూవీ ఎందుకో కానీ తెలుగులో ఏ నిర్మాత డబ్ చేయలేకపోయాడు. లేకపోతే మనదగ్గర కొద్దో గొప్పో ఆడేదేమో. అలా మిస్ అయ్యింది కానీ యుట్యూబ్ లో మాత్రం ఈ మూవీ బాగానే రచ్చ చేస్తోంది. కౌన్ హై విలన్ పేరుతో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.