నటి భావన కిడ్నాప్ తోపాటు వేధింపుల కేసులో ప్రముఖ మలయాళ నటుడు దిలీప్ బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు 85 రోజుల పాటు జైలులో గడిపిన దిలీప్ ను `అసోసియేషన్ ఆఫ్ మలయాళం మావీ ఆర్టిస్ట్స్(అమ్మ) `లోకి చేర్చుకోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ఇంకా కేసు విచారణలో ఉండగానే....దిలీప్ ను `అమ్మ`లో సభ్యత్వం కల్పించిన అధ్యక్షుడు మోహన్ లాల్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత, తాను నిర్దోషినని నిరూపితమైన తర్వాతే సభ్యత్వం తీసుకుంటానని దిలీప్ ...`అమ్మ`లో చేరలదే. ఈ నేపథ్యంలో `అమ్మ`అధ్యక్షుడు మోహన్ లాక్ కు షాక్ తగిలింది. కేరళ ప్రభుత్వం ప్రకటించే సినిమా అవార్డుల ఫంక్షన్ కు మోహన్ లాల్ ను బాయ్ కాట్ చేయాలని దర్శకుడు బిజు కుమార్ దామోదరణ్ అలియాస్ డీఆర్ బిజు సంచలన ప్రకటన చేశారు. బిజు తన ఫేస్ బుక్ లో చేసిన ప్రకటనకు పలువురు నటీనటులు మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం మాలీవుడ్ లో ఈ వార్త తీవ్ర చర్చనీయాంశమైంది.
మలయాళ సూపర్‌స్టార్ మోహన్ లాల్ కు సొంత ఇండస్ట్రీ నుంచి చేదు అనుభవం ఎదురైంది. ఆ అవార్డుల కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఎంపికైన మోహన్ లాల్ ను హాజరుకానివ్వకూడదని మాలీవుడ్ లో మెజారిటీ అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. ఓ నటికి అన్యాయం చేసిన దిలీప్ కు మద్దతిస్తోన్న మోహన్ లాల్ కు గౌరవం ఇవ్వకూడదని బిజూ తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశారు. మోహన్ లాల్ చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకోవడానికి ఎవ్వరూ ఇష్ట పడటం లేదన్నారు. సాంస్కృతికశాఖ మంత్రి సమక్షంలో ముఖ్యమంత్రి చేతుల మీదుగా సినీ అవార్డులు అందజేయడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ప్రకాష్ రాజ్ - ఎన్ ఎస్ మాధవన్ - సచిదానందన్ -కేజీ శంకరన్ పిళ్లై రాజీవ్ రవి - బినా పాల్ - రిమా కల్లింగల్ - శృతి హరహరన్ లతో పాటు పలువురు సెలబ్రిటీలు తన ప్రకటనకు మద్దతిస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ అవార్డు ప్రదానోత్సవానికి మోహన్ లాల్ హాజరవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.