గెస్ట్‌ రోల్‌ తోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బస్టర్‌ పొందాడు

Update: 2018-10-14 13:48 GMT
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ అక్కడ ఏ సినిమా చేసినా కూడా మినిమం గ్యారెంటీగా ఆడుతుందంటూ అక్కడ ట్రేడ్‌ వర్గాల వారు అంటూ ఉంటారు. మోహన్‌ లాల్‌ సినిమా వస్తుందంటే అక్కడ సినీ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. తాజాగా మోహన్‌ లాల్‌ నటించిన చిత్రం ‘కాయంకులం కొచున్ని’. ఈ చిత్రంలో మరో మలయాళ స్టార్‌ హీరో నివిన్‌ పౌలీ కూడా నటించాడు. మలయాళ సినీ పరిశ్రమలో గతంలో ఎప్పుడు లేనంత బడ్జెట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించడం జరిగింది, అంతే స్థాయిలో ఈ చిత్రం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ ను దక్కించుకుని రికార్డులను కొల్లగొడుతోంది.

తొలి రోజు ఈ చిత్రం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా 5.5 కోట్లను వసూళ్లు చేసింది. తెలుగు ప్రేక్షకులకు ఈ మొత్తం చాలా తక్కువే. కేవలం నైజాం ఏరియాలోనే మొదటి రోజు స్టార్‌ హీరోల సినిమాలు అంతకు రెట్టింపు, మూడు రెట్టు వసూళ్లు చేస్తాయి. కాని కేరళ రాష్ట్రం చిన్నది, దాంతో పాటు అక్కడ థియేటర్ల సంఖ్య చాలా తక్కువ. 5.5 కోట్లు మొదటి రోజు వసూళ్లు అంటే అదో పెద్ద అద్బుతంగానే అక్కడ చెప్పుకుంటారు. లాంగ్‌ రన్‌ లో అక్కడ స్టార్‌ హీరో సినిమా 25 నుండి 30 కోట్లు రాబడితే బ్లాక్‌ బస్టర్‌ గా చెప్పుకుంటూ ఉంటారు.

ప్రపంచ వ్యాప్తంగా తొలి రెండు రోజుల్లో ‘కాయంకులం కొచున్ని’ చిత్రం ఏకంగా 16 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను రాబట్టిందట. ఇక నిన్న, నేడు శని, ఆదివారాలు అవ్వడంతో సినిమా కొత్త రికార్డులను సృష్టించబోతుందంటూ అక్కడ ట్రేడ్‌ వర్గాల వారు అంటున్నారు. ఇంతగా వసూళ్లకు కారణం అవుతున్న మోహన్‌ లాల్‌ ఈ చిత్రంలో కేవలం గెస్ట్‌ రోల్‌ ను మాత్రమే చేశాడు. ఆ కొన్ని నిమిషాల రోల్‌ ప్రేక్షకులకు కనెక్ట్‌ అవ్వడంతో ఇంత భారీగా వసూళ్లు నమోదు అవుతున్నాయి. మోహన్‌ లాల్‌ గతంలో నటించి సూపర్‌ హిట్‌ అయిన ‘పులి మురుగన్‌’ చిత్రం రికార్డులన్నీ కూడా ఒక్కటొక్కటిగా ‘కాయంకులం కొచున్ని’ వశం అవుతున్నాయి.
Tags:    

Similar News