మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజా చిత్రం 'లూసీఫర్'. అక్కడ వంద కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన లూసీఫర్ ను తెలుగులో డబ్బింగ్ చేసి మొన్న విడుదల చేయడం జరిగింది. ఈ చిత్రంకు భారీ ఎత్తున ప్రచారం చేయడంతో పాటు, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయిన సురేష్ ఫిల్మ్స్ నుండి విడుదల చేయడం జరిగింది. సురేష్ బాబు ఇన్వాల్వ్ మెంట్ ఉండటంతో పాటు, తెలుగు ప్రేక్షకులు మోహన్ లాల్ సుపరిచితుడే అనే ఉద్దేశ్యంతో లూసీఫర్ కు మంచి ఓపెనింగ్స్ వస్తాయని అంతా భావించారు. కాని అనూహ్యంగా లూసీఫర్ ను పట్టించుకునే నాధుడే కరువయ్యారు.
లూసీఫర్ చిత్రం టైటిల్ కాస్త విభిన్నంగా ఉండటంతో పాటు, ట్రైలర్ మరియు టీజర్ లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో యూనిట్ సభ్యులు విఫలం అయ్యారు. రొటీన్ మాస్ మసాలా స్టోరీ అయిన లూసీఫర్ సినిమాకు మలయాళి ప్రేక్షకులు ఎలా వంద కోట్ల రూపాయలు ఇచ్చారా అంటూ ఆశ్చర్యం వేయక మానదు. లూసీఫర్ చిత్రం డబ్బింగ్ రైట్స్ ను భారీ మొత్తంకు కొనుగోలు చేయడంతో పాటు, డబ్బింగ్ ఖర్చులు, ప్రమోషన్ ఖర్చులు అంటూ భారీగానే ఖర్చు పెట్టి ఉంటారు. ఇప్పుడు కనీసం పబ్లిసిటీ ఖర్చులు అయినా వచ్చేది అనుమానమే అంటూ సినీ వర్గాల వారు అంటున్నారు.
తెలుగులో జనతా గ్యారేజ్ చిత్రంతో పాటు, ఇంకా పలు చిత్రాలతో ఆకట్టుకున్న మోహన్ లాల్ తప్పకుండా లూసీఫర్ తో తెలుగు ఆడియన్స్ ను ఆకట్టుకుంటాడని భావించారు. కాని అనూహ్యమైన ఫలితంతో డబ్బింగ్ రైట్స్ దక్కించుకున్న నిర్మాతలు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మజిలీ మరియు చిత్రలహరి ఉన్న నేపథ్యంలో లూసీఫర్ ను పట్టించుకోవడం లేదు.