స్టార్ హీరోలు దర్శకులుగా అవతారం ఎత్తడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఒకప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ కృష్ణలు ఈ రెండు పడవల ప్రయాణాన్ని అద్భుతంగా నడిపి శభాష్ అనిపించుకున్నారు . బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. చిరంజీవితో మొదలైన రెండో తరంలో ఎవరూ ఆ సాహసం చేయలేకపోయారు. ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రం జానీ పేరుతో ప్రయోగం చేశాడు కాని అది చేదు ఫలితాన్నే ఇచ్చింది. మళ్ళి ఇంకెవరు దర్శకత్వం జోలికి వెళ్ళలేదు.
మలయాళం కంప్లీట్ యాక్టర్ గా పేరున్న స్టార్ హీరో మోహన్ లాల్ త్వరలో దర్శకుడిగా మారబోతున్నారు. బరూజ్ పేరుతో రూపొందే మూవీని కోట్లాది రూపాయల బడ్జెట్ తో తనే టైటిల్ రోల్ పోషిస్తూ స్వయంగా నిర్మించబోతున్నారు. ఇది మోహన్ లాల్ స్వయంగా ప్రకటించడం విశేషం. దీనికి ఒకరకంగా పృథ్విరాజ్ స్ఫూర్తిగా నిలిచినట్టు కనిపిస్తోంది. ఇటీవలే అతను డెబ్యు చేసిన లూసిఫర్ కేరళలో కొత్త రికార్డులు నెలకొల్పింది. దారుణమైన పబ్లిసిటీతో తెలుగులో కనీస స్థాయిలో ఆడలేదు కాని సినిమాలో మంచి మాస్ కంటెంట్ ఉంటుంది.
ఎలాగూ తనకన్నా చిన్నవాడు అభిమాని పృథ్విరాజ్ సక్సెస్ కాగా లేనిది తానెందుకు కాలేను అనుకున్నాడో ఏమిటో ఆలోచన వచ్చిందే తడవుగా అమలులో పెట్టేశారు మోహన్ లాల్. తెలుగు తమిళ్ లో మల్టీ లాంగ్వేజ్ వెర్షన్ లో పూర్తిగా 3డిలో షూట్ చేయబోతున్న బరూజ్ స్క్రిప్ట్ పూర్తి కావొచ్చే దశలో ఉంది. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో రూపొందే బరూజ్ షూటింగ్ లో గోవాలో మొదలుపెట్టబోతున్నారు