నందమూరి బాలకృష్ణ తెరంగేట్రం ఎలా చేశారో నందమూరి అభిమానులు అందరికీ తెలుసు. తాతమ్మ కల చిత్రంలో ఓ రోల్ చేసి ఇండస్ట్రీలోకి ప్రవేశించారు బాలయ్య. ఇప్పుడు తన కుమారుడు మోక్షజ్ఞను కూడా తెరకు పరిచయం చేయడానికి ఇదే రూట్లో వెళుతున్నారు బాలకృష్ణ. ఎన్ బీకే నటిస్తున్న వందో సినిమాలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే ఖాయమైన విషయం తెలిసిందే.
అయితే మరి మోక్షజ్ఞ రోల్ ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న బాలయ్య అభిమానులను బాగానే వేధిస్తోంది. ఒకటి రెండు నిమిషాలు కనిపించే రోల్ చేస్తాడా లేక బాలకృష్ణ చిన్నప్పటి పాత్రను చేయిస్తారా అని అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నందమూరి వారసుడు ఎంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. మోక్షజ్ఞ రోల్ ఎలా ఉంటుందో తెలిసింది. ఆదిత్య 369కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ మూవీకి ఆదిత్య 999 అనే పేరు పెట్టాలని భావిస్తున్నారు.
టైం మెషీన్ ని తయారు చేసేందుకు బాలయ్య, అతని స్నేహితుడైన సైంటిస్ట్ సమస్యలో ఇరుక్కున్న సమయంలో.. ఓ మ్యాథమెటిక్స్ మేథావిగా మోక్షజ్ఞ రోల్ ఉంటుందని తెలుస్తోంది. గణితంలో మేథావి అయిన ఈ రోల్ చెప్పిన ఓ ఈక్వేషన్ తో.. టైం మెషీన్ కి సంబంధించిన ఓ చిక్కు ముడి విడిపోతుందట. ఆ తర్వాత కాలంలో ప్రయాణించేస్తారు. ఈ గణిత శాస్త్ర మేథావి పాత్ర సినిమాలో 10 నిమిషాల పాటు ఉండనుందని తెలుస్తోంది. ఇందులో ఎక్కువగా బాలయ్య - మోక్షజ్ఞ కలిసి నటించే సమయం ఎక్కువగానే ఉంటుందట.