ఇటీవల సినిమాలతో పాటు రాజకీయాలపైనా తన అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ సిద్ధార్థ్ నిరంతరం నెటిజనుల్లో చర్చకు కారణమవుతున్నాడు. ఇప్పుడు మరో విషయంలో అతడు సోషల్ మీడియాల్లో హాట్ టాపిక్ అయ్యాడు.
తమిళనాడు- మధురైలో విమానాశ్రయ భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను వేధించారని నటుడు సిద్ధార్థ్ ఆరోపించారు. ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్ లో విమానాశ్రయ భద్రతా సిబ్బంది తన తల్లిదండ్రులను దాదాపు ఇరవై నిమిషాలు వేధించారని.. వారి బ్యాగ్ ల నుండి నాణేలను తొలగించారని.. పదేపదే హిందీలో మాట్లాడారని ఇంగ్లీష్ లో మాట్లాడమని అభ్యర్థించినప్పటికీ నిరాకరించారని ఆరోపించారు.
తాము నిరసన తెలిపినప్పుడు భద్రతా సిబ్బంది ''భారత్ లో ఇలాగే ఉంటుంది'' అని చెప్పారని సిద్ధార్థ్ ఆరోపించారు. సి.ఆర్.పి.ఎఫ్ పోలీసులు చాలా సేపు విమానాశ్రయంలో వేధించారు.
వారు పెద్దవారైన నా తల్లిదండ్రులను వారి పట్ల మర్యాదగా ప్రవర్తించలేదు. మాతో పదే పదే కావాలని హిందీలో మాట్లాడారు!! అని సిద్ధార్థ్ తన ఇన్ స్టాలో ఆవేదన వ్యక్తం చేసాడు.
మదురై విమానాశ్రయంలో భద్రతను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లేదా CISF నిర్వహిస్తుంది. అయితే సిద్ధార్థ్ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పోస్ట్ లో CRPF లేదా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ పై ఆరోపణలు చేశాడు. ఇది అవగాహన లేని ఆరోపణగా చర్చకు తెర తీసింది.
దాదాపు 20 ఏళ్ల కెరీర్ లో సిద్ధార్థ్ అనేక తమిళ- తెలుగు- హిందీ చిత్రాలలో నటించాడు. దేశవ్యాప్తంగా అతడికి పాపులారిటీ ఉంది. కానీ ఇటీవల రేసులో వెనకబడ్డాడు. కథానాయికలతో ఎఫైర్ల కారణంగాను సిద్ధార్థ్ నిరంతరం వార్తల్లో నిలిచాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.