‘భరత్ అనే నేను’ ఇంకా పెద్దది కాబోతోంది
‘భరత్ అనే నేను’ ప్రోమోలు చూసిన వాళ్లందరికీ ఇంతకుముందు మహేష్ బాబు-కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన ‘శ్రీమంతుడు’ సినిమానే గుర్తుకొచ్చింది. ఈ చిత్ర కథాంశం వేరైనప్పటికీ.. ‘శ్రీమంతుడు’ను తలపించే పలు అంశాలు ఇందులో కనిపిస్తాయి. బహుశా దీన్ని సెంటిమెంటుగా కొరటాల-మహేష్ భావించి ఉండొచ్చేమో కూడా. ఆ సెంటిమెంటు ఫలించి ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకుంది. ఓపెనింగ్స్ విషయంలో అదరగొట్టింది. విశేషం ఏంటంటే.. రిలీజ్ తర్వాత కూడా ‘శ్రీమంతుడు’ సెంటిమెంటును చిత్ర బృందం ఫాలో అవుతున్నట్లుగా ఉంది. ‘శ్రీమంతుడు’ ట్రైలర్లో కనిపించి.. సినిమాలో లేని కొన్ని సన్నివేశాల్ని సినిమా విడుదలైన కొన్ని రోజుల తర్వాత కలిపిన సంగతి తెలిసిందే. తన తొలి సినిమా ‘మిర్చి’ విషయంలోనూ కొరటాల ఇలాగే కొన్ని రోజుల తర్వాత ఒక ఫైట్ జోడించాడు.
ఇప్పుడు ‘భరత్ అనే నేను’ విషయంలోనూ అలాగే చేయనున్నాడట కొరటాల. ఈ చిత్ర నిడివి చాలా పెద్దగా వచ్చిందని.. దాదాపు రెండు సినిమాలకు సరిపడా కంటెంట్ చేతికొస్తే దాన్ని కుదించి 2 గంటల 53 నిమిషాల లెంగ్త్ తో ఫైనల్ కట్ రెడీ చేశామని కొరటాల చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్ని మంచి సీన్లను కూడా తీసేయాల్సి వచ్చిందట. ఐతే ఇప్పుడు అలా మిస్సయిన కొన్ని సీన్లను సినిమాకు జోడించబోతున్నారట. ఈ వీకెండ్లో ఆ సన్నివేశాలు సినిమాకు కలిసే అవకాశాలున్నాయి. ఐతే ఇప్పటికే నిడివి 3 గంటలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో కొత్త సీన్లు కలిస్తే సినిమా మరీ పెద్దదైపోతుందేమో. మరి ఈ అదనపు సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకర్షిస్తాయో చూడాలి. మొత్తానికి రిలీజ్ తర్వాత సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లడానికి ‘భరత్ అనే నేను’ టీం బాగానే కృషి చేస్తోంది. ఆల్రెడీ థ్యాంక్స్ మీట్ ఏర్పాటు చేసిన చిత్ర బృందం.. ఈ వారాంతంలో తిరుపతి వేదికగా సక్సెస్ మీట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.