కరోనా సమయంలో లాక్డౌన్ పడి థియేట్రికల్ రిలీజ్ సినిమాలను ప్రేక్షకులు బాగా మిస్ అవుతున్నారు. అయితే థియేటర్స్ లేని లోటును ఓటిటి ప్లాట్ ఫామ్స్ తీర్చుతున్నాయి. అయితే తాజాగా టాలీవుడ్ హీరో మంచు విష్ణు నటించిన 'మోసగాళ్లు' సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ రిలీజ్ అయినటువంటి ఈ సినిమా మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. తెలుగు పరిశ్రమలో కొన్నేళ్లుగా ఫ్లాపుల్లో ఉండిపోయాడు హీరో విష్ణు. వరుస ప్లాప్ లతో ప్రస్తుతం ఖచ్చితమైన హిట్ కోసం చూస్తున్నాడు. అయితే ఇన్నేళ్ల ప్లాప్ లోటును పూర్తి చేస్తుందనే నమ్మకంతో మోసగాళ్లు సినిమా చేసాడు. కానీ ఆ సినిమా అనుకున్న స్థాయిలో ఆడకపోయే సరికి నిరాశే ఎదురైందని చెప్పాలి.
కెరీర్ పరంగా కొన్నేళ్ల నుండి విష్ణుకు ఓ మాదిరి హిట్ కూడా పడలేదు. చివరిగా ఆచారి అమెరికా యాత్ర, ఓటర్ సినిమాలు వచ్చినప్పటికి ఘోరమైన ఫలితాన్ని తీసుకొచ్చాయి. ఆ వెంటనే కొంతకాలం దూరంగా వెళ్ళిపోయి ఎలాగైనా ఓ సాలిడ్ హిట్టు కొట్టాలనే ఉద్దేశంతో మోసగాళ్లు సినిమాతో ప్రయత్నం చేసాడు. ఇటీవల కెరీర్ ప్రారంభమైన ఐదారేళ్లకు హీరోలు స్టార్డం అందుకుంటున్నారు. కానీ విష్ణు విషయంలో అలా జరగలేదు. కెరీర్ పరంగా ఇప్పటికి స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు. దాదాపు రెండు దశాబ్దాలు కెరీర్ లో ఒకసారి కూడా స్టార్ హీరోల లిస్టులో చేరలేకపోయాడు.
చాలా పకడబంధీగా పక్కా ప్రణాళికతో మోసగాళ్లు సినిమా ప్లాన్ చేసుకున్నాడు. పాన్ ఇండియా మూవీగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ తమిళ కన్నడ భాషలలో రిలీజ్ చేసాడు. కానీ కమర్షియల్ గా కూడా నిరాశే మిగిల్చింది. అయితే జెఫ్రీ గీ చిన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇండియాలో జరిగిన అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కింది. విష్ణు - కాజల్ అగర్వాల్ ప్రధానపాత్రలు పోషించిన ఈ సినిమాలో సునీల్ శెట్టి- నవదీప్ - నవీన్ చంద్ర కీలకపాత్రలలో నటించారు. మరి థియేటర్స్ లో మిస్ అయినవారు ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో సినిమాను చూడవచ్చు. ఇప్పటికైతే సినిమా తెలుగులో మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం.