బ్రహ్మాస్త్ర దమయంతిని తిరస్కరిస్తున్న తెలుగు ప్రేక్షకులు

Update: 2022-09-11 06:21 GMT
బాలీవుడ్ భారీ బడ్జెట్‌ మూవీ బ్రహ్మాస్త్ర తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ బడ్జెట్‌ తో రూపొందిన బ్రహ్మాస్త్ర సినిమా లో విలన్ పాత్ర  దమయంతి గా మౌనీ రాయ్‌ నటించిన విషయం తెల్సిందే. ఈ సినిమాపై మొదటి నుండి ఆమె చాలా నమ్మకంగా కనిపిస్తూ వచ్చింది. గత రెండు సంవత్సరాలుగా ఆమె ప్రతి ఇంటర్వ్యూలో మరియు మీడియా ఇంట్రాక్షన్ లో ఈ సినిమా గురించి గొప్పగా చెప్పుకొచ్చింది.

ప్రతిసారి కూడా బ్రహ్మాస్త్ర తనకు కెరీర్ లో నిలిచి పోయే సినిమా అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేసింది. అన్నట్లుగానే బ్రహ్మాస్త్ర సినిమాలో ఆమెకు చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర దక్కింది. ఆ పాత్రలో మౌనీ రాయ్‌ పాత్రకి హిందీ ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలీవుడ్‌ లో ముందు ముందు మౌనీ రాయ్ తప్పకుండా స్టార్‌ డమ్‌ దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా నిలవడం ఖాయం అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

కానీ సౌత్‌ ఇండియాలో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులు మౌనీ రాయ్ పాత్రను తిరష్కరించినట్లుగానే సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడి యొక్క పాత్ర డిజైన్ సరిగా లేదంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు దమయంతి పాత్రకు మౌనీ రాయ్ న్యాయం చేయలేక పోయింది అంటూ మరి కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

బ్రహ్మాస్త్ర సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన వచ్చింది. దాంతో మొదటి రోజు భారీ వసూళ్లను నమోదు చేయగా.. వీకెండ్‌ లో కూడా సినిమాకు మంచి బుకింగ్స్ నమోదు అవుతున్నట్లుగా టాక్‌ వినిపిస్తుంది. అయితే ఉత్తర భారతంలో మరియు ఇతర ప్రాంతాల్లో సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు నమోదు అవ్వడం లేదు అనేది బాక్సాఫీస్ వర్గాల  టాక్‌.
Tags:    

Similar News