యాక్టర్లు, ఎండార్స్ మెంట్లు... ఈ రెండింటికీ మాంచి లింక్ ఉంటుంది. ఫేమ్ ఉన్న పబ్లిక్ ఫిగర్స్ ను ఎంచుకుని, వాళ్లతో యాడ్స్ తీస్తుంటాయి కంపెనీలు. డబ్బు కోసం వీళ్లు నటిస్తారు. సేల్స్ కోసం కంపెనీలు అడిగినంత ఇచ్చుకుంటాయి. కానీ ఏ ప్రకటన పరమార్ధం అయినా ఒకటే... తమ ప్రోడక్ట్ సేల్స్ అమాంతం పెంచేసుకుని, జనాల జేబుల్లోని డబ్బులు కంపెనీల ఖాతాల్లో వేసుకోవడమే. ఇక్కడ స్టార్స్ కి, కంపెనీలు అకౌంట్లు బాగానే ఫిల్ అవుతాయి. మరి జనాల సంగతేంటి ?
సబ్బులు, షాంపూలు, పేస్ట్ లు, ఫెయిర్నెస్ క్రీములు... ఇలాంటి వస్తువులపై వచ్చే యాడ్స్ జనాల జీవితాలపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ కాసుల గలగలల కోసం... అన్నిటినీ అంగీకరించడం మాత్రం సరికాకపోవచ్చు. మన టాలీవుడ్ హీరోలు కూడా... ఇందుకు అతీతంగా కనిపించడం లేదు. అసలు మహేష్ రాయల్ స్టాగ్ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా చేయడంపై కొన్నాళ్లక్రితం పెద్ద వివాదమే నడిచింది. మనోడి మాట విని, లిక్కర్ తాగి ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకున్నానంటూ... ఒకతను కేస్ కూడా వేశాడు. తర్వాత ఇది ఏమైందో తెలీదు లెండి. తాజాగా ఇలా లిక్కర్ బ్రాండ్ కు అంబాసిడర్ల లిస్ట్ లో మాస్ మహరాజా కూడా చేరిపోయాడు.
'లార్డ్ అండ్ మాస్టర్' అనే బ్రాండ్‌కు రవితేజ ఓ యాడ్ చేశాడు. పోలీస్ గెటప్ లో ఖతర్నాక్ గా ఉన్నాడు మనోడు. డైలాగులు కూడా అదరగొట్టేశాడు. అయితే... ఇది కూడా మద్యం విక్రయాలకు చెందిన కంపెనీయే. అటు రాయల్ స్టాగ్ అయినా, ఇటు లార్డ్ & మాస్టర్ అయినా... కేసెట్స్& సీడీస్ అంటూ యాడ్స్ ఇస్తాయి. ఇది వాస్తవం కాదని అందరికీ తెలుసు. అసలు ఇవాల్టి రోజుల్లో ఇళ్లలో సీడీ ప్లేయర్స్, కేసెట్ ప్లేయర్స్ ఏ ఇంట్లోనూ కనిపించడం లేదు. ఎంపీ3 ప్లేయర్స్ వచ్చాక ఇవి కనుమరుగయ్యాయని అందరికీ తెలుసు. మరి వీటిలో చేస్తున్న స్టార్ల కు ఈ విషయం తెలీదా ? లేక సమాజం ఎటుపోతే మాకెందుకు, మా అకౌంట్లు నిండితే చాలని అనుకుంటున్నారా అని ప్రస్నిస్తున్నారు విమర్శకులు.
ఓ స్థాయికి చేరిన తర్వాత సామాజిక బాధ్యత అని ఒకటి ఉంటుంది. జనాల అభిమానంతో స్టార్ స్టేటస్ పొందిన హీరోలకు.. ఈ బాధ్యత ఉండాలి కదా! ఇకనైనా మన హీరోలు ఈ రూట్లో ఆలోచిస్తే బాగుంటుంది.