సౌత్ లో భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకులకు పరిచయం చేసింది శంకర్ అనడంలో సందేహం లేదు. ఆయన వరుసగా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలను తెరకెక్కించాడు. బాలీవుడ్ లో కూడా సాధ్యం కానంత బడ్జెట్ తో 2.ఓ ను ఆయన రజినీకాంత్ తో తెరకెక్కించాడు. ఇప్పటి వరకు శంకర్ తెరకెక్కించిన ఆ సినిమానే ఇండియన్ సినిమాలో అత్యధిక బడ్జెట్ సినిమా అంటూ మీడియా వర్గాల టాక్. ఆయన ఇండియన్ 2 సినిమాను కూడా భారీ బడ్జెట్ తో చేశాడు. కాని కొన్ని కారణాల వల్ల ఆ సినిమా క్యాన్సిల్ అయ్యింది.
ఇక రామ్ చరణ్ తో ప్రస్తుతం ప్లాన్ చేస్తున్న సినిమా కూడా దాదాపుగా 250 కోట్ల నుండి 300 కోట్ల బడ్జెట్ తో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల టాక్. శంకర్ ఏ సినిమా చేసినా భారీగానే ఉంటుంది. ఆయన సినిమాలను ఇతర దర్శకులతో నిర్మించినా కూడా భారీ బడ్జెట్ ను ఖర్చు చేస్తాడు. ఒక్క పాట తీయాలంటే కోట్లు ఖర్చు పెట్టే దర్శకుడు ఇండియాలో ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం శంకర్ అనడంలో సందేహం లేదు. ఆయన యాక్షన్ సన్నివేశాలు.. వీఎఫ్ఎక్స్ సన్నివేశాలు ఇలా ప్రతీది కూడా చాలా కాస్ట్లీ అంటారు.
సినిమా లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా ఆయన భారీతనంను కనబర్చుతున్నాడు. ఇటీవల తన కూతురు పెళ్లి చేసిన శంకర్ భారీ ఎత్తున ఖర్చు చేశాడు. కరోనా కారణంగా అతి తక్కువ మంది గెస్ట్ ల సమంక్షంలో వివాహం జరిగింది. ఈ పెళ్లికి తమిళనాడు సీఎం స్టాలిన్ హాజరు అయ్యారు. ఇంకా కొందరు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరు అయ్యారు. ఈ సమయంలో ఆయన పెళ్లి కోసం ఖర్చు చేసిన మొత్తం గురించి ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ ప్రముఖులు సైతం ముక్కున వేలు వేసుకునేలా ఈయన పెళ్లి కోసం రూ.10 కోట్ల ను ఖర్చు చేశాడట. అల్లుడు కు ఇచ్చిన కట్న కానుకలు కాకుండా కేవలం పెళ్లి ఖర్చునే ఇంత భారీగా చేశాడు.
ఇక అల్లుడికి పెద్ద మొత్తంలోనే కానుకలను ముట్టజెప్పాడు అంటున్నారు. శంకర్ ఖర్చు చేసిన పది కోట్లు కళ్యాణ మండపం.. నగలు వచ్చిన బంధువులకు ఏర్పాట్లు ఇంకా పెళ్లికి ముందు ఏర్పాట్లు. వీటికే అంత మొత్తంలో ఖర్చు చేసిన శంకర్ మరోసారి తన భారీతనంను చెప్పకనే చెప్పాడు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో రూపొందబోతున్న రామ్ చరణ్ మూవీ కోసం ప్రస్తుతం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో పాన్ ఇండియా స్టార్ గా రామ్ చరణ్ ను ఖచ్చితంగా శంకర్ నిలుపుతాడు అనే నమ్మకంతో మెగా అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ టాలీవుడ్ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయిన వెంటనే శంకర్ దర్శకత్వంలో సినిమాను మొదలు పెట్టబోతున్నారు. సినిమా షూటింగ్ ను మొదలు పెట్టేందుకు గాను దిల్ రాజు ఏర్పాట్లు చేస్తున్నాడు.
ఇండియన్ 2 వివాదం నుండి ఇటీవలే బయట పడ్డ శంకర్ చరణ్ మూవీ పై పూర్తి దృష్టి పెట్టబోతున్నాడు. ఇండియన్ 2 సినిమా పూర్తి చేయకుండా మరో సినిమాను చేయవద్దంటూ శంకర్ ను ఆదేశించాల్సిందిగా లైకా ప్రొడక్షన్స్ వారు చేసిన విజ్ఞప్తిని మద్రాస్ హైకోర్టు కొట్టి వేసింది. దాంతో శంకర్ ఇక ఇండియన్ 2 గురించి ఆలోచించక పోవచ్చు అంటున్నారు.