నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ.. షార్టుగా చెప్పాలంటే ‘ఎన్ ఐఏ’. భారత దేశ భద్రత - నిఘా విషయంలో ఈ సంస్థది కీలకమైన పాత్ర. దీని గురించి మీడియాలో కానీ.. బయట కానీ పెద్దగా చర్చ ఉండదు. చాలా పెద్ద స్థాయిలో సైలెంటుగా ఈ ఏజెన్సీ తన పని తాను చేసుకు పోతూ ఉంటుంది. ఇప్పుడు టాలీవుడ్ సినిమాల దృష్టి దీనిపై పడింది. సీబీఐ.. సీఐడీ లాంటి సంస్థల్ని సినిమాల్లో వాడుకుని వాడుకుని బోర్ కొట్టేయడంతో ఇప్పుడు కొత్తగా దీనిపై దృష్టి మళ్లింది. మహేష్ బాబు కొత్త సినిమా ‘స్పైడర్’లో హీరో ఈ ఎన్ ఐఏ అధికారే కావడం విశేషం. ఈ ఏజెన్సీ పనితీరు ఎలా ఉంటుందో సినిమాలో చూపిస్తామని.. ఈ విషయమై చాలా పరిశోదన చేశానని మురుగదాస్ అంటున్నాడు.
మరోవైపు రాజశేఖర్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘గరుడ వేగ’లో కూడా హీరో ఎన్ ఐఏ అధికారే కావడం విశేషం. అది పూర్తి స్థాయిలో ఎన్ఐఏ నేపథ్యంలోనే సాగే సినిమా. ‘స్పైడర్’ కంటే కూడా డీప్ గా అందులో ఎన్ ఐఏ గురించి చూపిస్తారట. ఇక ఈ రెండు సినిమాల కంటే ముందు ఎన్ ఐఏ అధికారి పాత్రను శుక్రవారం రిలీజవుతున్న ‘యుద్ధం శరణం’లో చూడబోతున్నాం. ఈ చిత్రంలో మురళీ శర్మ పోషిస్తున్న పాత్ర అదే. హీరో.. విలన్ తర్వాత ‘యుద్ధం శరణం’లో కీలక పాత్ర మురళీదేనట. స్పైడర్.. గరుడ వేగ సినిమాల కంటే ముందు ‘యుద్ధం శరణం’ ఎన్ ఐఏ గురించి ఇంట్రడక్షన్ ఇస్తుందన్నమాట. ఆ తర్వాత ఆ ఏజెన్సీ గురించి జనాలకు మరింతగా ఆ రెండు సినిమాలు తెలియజెబుతాయేమో.