భానుమతి ఒకటే పీస్ రెండు కులాలు రెండు మతాలు.. హైబ్రీట్ పిల్ల.. అంటూ `ఫిదా` మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకుల్ని ఫిదా చేసేసింది. మలయాళ ఫిల్మ్ `ప్రేమమ్`తో నటిగా కెరీర్ ప్రారంభించి అక్కడ కూడా మలర్ పాత్రతో మెస్మరైజ్ చేసింది. తనదైన మార్కు నటనతో గ్లామర్ పాత్రలకు దూరంగా వుంటూ యాక్టింగ్ ఓయెంటెడ్ క్యారెక్టర్స్ ప్రాధాన్యతన నిస్తూ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది.
దక్షిణాదిలో అత్యంత క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా కోట్లాది మంది హృదయాలని కొల్లగొట్టింది. నటిగా ప్రాధాన్యత వున్న పాత్రలతో పాటు తనకు సంతృప్తినిచ్చే పాత్రల్లో మాత్రమే నటిస్తూ క్రేజీ హీరోయిన్ గా తన ప్రత్యేకతని చాటుకుంటూ వస్తోంది. టాప్ హీరోలు సైతం తన పక్కన డ్యాన్స్ లో తేలిపోతారని కామెంట్ లు వినిపించే స్థాయికి చేరిన సాయి పల్లవి గత కొంత కాలంగా ఒకే తరహాలో కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ వస్తోంది.
తన క్రేజ్ ని గమనిస్తున్న ఫ్యాన్స్ లేడీ పవర్ స్టార్ గా పిలుచుకుంటున్నారు. ఇదిలా వుంటే సాయి పల్లవి నటించిన సినిమాలేవీ గత కొన్ని నెలలుగా బాక్సాఫీస్ వద్ద భారీ వైఫల్యాలని చవి చూస్తున్నాయి. సాయి పల్లవి నటించిన `విరాటపర్వం` రీసెంట్ గా విడుదలై తీవ్ర నిరాశకు గురిచేసింది.
కంప్లీట్ సీరియస్ గా సాగే ఈ మూవీలో వెన్నెలగా నటించి ఆకట్టుకున్నా సినిమా మాత్రం ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. ఇక ఆ తరువాత చేసిన `గార్గి` కూడా ప్రశంసలు దక్కించుకుందే కానీ సక్సెస్ ని మాత్రం అందించలేకపోయింది.
ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు పోవడం, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలకు మాత్రమే సాయి పల్లవి ప్రాధాన్యతనిస్తుండటంతో కొంత మంది నిర్మాతలు తన పంథాను మార్చుకోవాలని కోరారట. కమర్షయిల్ సినిమాల్లో నటించాలని, గ్లామర్ కు ప్రాధాన్యత వున్న సినిమాల్లో నటించాలని సలహా ఇచ్చారట. అయితే సాయి పల్లవి మాత్రం తాను తనకు నటిగా సంతృప్తినిచ్చే సినిమాల్లో మాత్రమే నటిస్తానని, తన మనస్సాక్షికి వ్యతిరేకంగా నటించలేనని స్పష్టం చేసిందని చెబుతున్నారు.
అయితే మెజారిటీ వర్గం మాత్రం సాయి పల్లవి తన గేమ్ ని ఛేంజ్ చేయాల్సిందేనని, అలా చేస్తేనే ఆమెకు లాంగ్ రన్ వుంటుందని, అలా కాని పక్షంలో కెరీర్ ప్రశ్నార్థకంలో పడుతుందని చెబుతున్నారట. కానీ సాయి పల్లవి మాత్రం తాను తీసుకున్న స్టాండ్ కే కట్టుబడి వుంటానని, అలా జరగని రోజు క్లినిక్ అయినా పెట్టుకుంటాను లేదా ఏదైనా జాబ్ చేసుకుంటానని చెప్పందిని ప్రచారం జరుగుతోంది.