హ్యాష్ టాగ్స్ తో బజ్ వస్తుందా రాజా??

Update: 2020-03-18 14:30 GMT
ఈమధ్య సోషల్ మీడియా ప్రచారం ఊపందుకోవడం తో కొందరు హీరోలు తమ సినిమాలకు సంబంధించి కొన్ని భ్రమల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కొందరు యువ హీరోలతో పాటుగా మీడియమ్ రేంజ్ హీరోలు కూడా ఇదే విధంగా ఆలోచిస్తూ తమ సినిమాల మార్కెట్ ను చేజేతులారా తగ్గించుకుంటున్నారని ఒక వాదన వినిపిస్తోంది.

కొత్త తరం హీరోలు కాబట్టి ఒక సినిమాకు సంబంధించి ట్విట్టర్ లో హ్యాష్ టాగ్ లు ట్రెండింగ్ చేస్తే చాలు.. అదే ప్రచారం తీసుకొస్తుందని.. బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్లు తెగుతాయని అనుకుంటున్నారట. ఇదిలా ఉంటే ఓ యువ హీరో సినిమా ఓపెనింగ్ ఈరోజు జరిగింది. దీనిపై ఇండస్ట్రీ జనాలు 'ఊరంతా ఒకదారైతే ఉలిపికట్టెది మరో దారి' అంటూ పాత సామెతలు గుర్తు చేస్తున్నారు. కరోనా ప్రభావంతో 15 రోజుల పాటు టాలీవుడ్ కు శెలవులు. ఈ సమయలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని అవసరం అయితే తప్ప ఊరికే బయటకు రావద్దని ప్రభుత్వం నెత్తి నోరు కొట్టుకుంటూ ఉంటే ఏదో కొంపలు మునిగిపోయినటు సినిమాను లాంచ్ చెయ్యడంపై ఇండస్ట్రీలో సెటైర్లు పడుతున్నాయి.

ఇక సినిమా కార్యక్రమాలు ఏవీ లేవు కాబట్టి ఈ సినిమాకు సంబంధించిన హ్యాష్ టాగ్ ను ట్రెండింగ్ లోకి తీసుకురావాలని తద్వారా బజ్ క్రియేట్ చెయ్యాలని ప్లాన్ లో ఉన్నారట. చాలామందికి ఈ సినిమా హ్యాష్ టాగ్ పై ట్వీట్ లు వెయ్యాలని ఎలర్టులు కూడా వచ్చాయట. దీంతో.. ఇదేం స్ట్రేటజీనో.. ఇలాంటి ట్రిక్కులకు టికెట్లలు తెగుతాయా అని జనాలు విసుక్కుంటున్నారు. ఈ హీరోలు డిజిటల్ మాయ నుంచి బయటకు వచ్చి టికెట్లు తెగడానికి ఏ చేస్తే బాగుంటుందో ఆ పనులు చెయ్యాలని సూచనలను కూడా అందిస్తున్నారు.
Tags:    

Similar News