సినిమా.. టీవీ ఇకపై ఏదైనా డబుల్‌ అంటున్న ప్రియమణి

Update: 2022-02-15 05:30 GMT
తెలుగు ప్రేక్షకులకు ఎవరే అతగాడు సినిమా తో పరిచయం అయిన ప్రియమణి తమిళ మలయాళ సినిమాలు చేసి సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్ గా నిలిచింది. 2003 సంవత్సరంలో కెరీర్‌ ను ఆరంభించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలు అవుతున్నా కూడా ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేస్తూనే ఉంది. హీరోయిన్స్ పాత్రలే కావాలని పట్టుకుని వేలాడకుండా తెలివిగా అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ మంచి సంపాదన దక్కించుకుంటుంది.

హీరోయిన్‌ గా దాదాపు పదేళ్ల పాటు మంచి ఫామ్ లో కొనసాగిన ప్రియమణి కి మెల్ల మెల్లగా సినిమా ఆఫర్లు తగ్గుతూ రావడంతో ఏమాత్రం మొహమాటం లేకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేసేందుకు ఓకే చెప్పింది. అదే సమయంలో బుల్లి తెరపై షో లకు కూడా సిద్దం అయ్యింది. తద్వార సినిమాల్లో హీరోయిన్ గా నటించకున్నా కూడా ప్రేక్షకులకు చేరువగానే ఉంది. దాంతో ప్రియమణి కెరీర్‌ అలా అలా దూసుకు పోతూనే ఉంది.

పెళ్లి తర్వాత సినిమాలకు ఈమె దూరం అవుతుందని అంతా భావించారు. కాని పెళ్లి చేసుకున్న తర్వాత తన సెకండ్‌ ఇన్నింగ్స్ ను మరింత స్పీడ్‌ గా తీసుకు వెళ్లుంది. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఢీ షో లో సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఈమె నటిగా కూడా వరుస సినిమాలు చేస్తూ ఉంది. తాజాగా ఈ అమ్మడు ఆహా ఓటీటీ కోసం భామ కలాపం లో నటించింది. ఆ సినిమా లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

భామ కలాపం తర్వాత ప్రియమణి కెరీర్‌ మరింత స్పీడ్ అందుకున్నట్లుగా కనిపిస్తుంది. క్యారెక్టర్‌ ఆర్టిస్టు పాత్రల కోసం ఈమెను ఎక్కువ మంది సంప్రదిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ సమయంలో ఈమె తన పారితోషికంను భారీగా పెంచేసిందనే వార్తలు కూడా వస్తున్నాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మొన్నటి వరకు ఈమె పారితోషికం రోజు వారి 1.5 నుండి 2 లక్షల రూపాయల వరకు ఉండేదట.

ఇప్పుడు భామ కలాపం సినిమా తర్వాత వస్తున్న బడా ఆఫర్ల నేపథ్యంలో రోజు వారి పారితోషికంను మూడు నుండి నాలుగు లక్షలకు పెంచేసిందని తెలుస్తోంది. ఈ పారితోషికంతో పాటు అదనపు చార్జీలు కూడా ఉంటాయట. అసిస్టెంట్‌ ఖర్చు మరియు ట్రావెలింగ్ అన్ని కలిపి మరో పాతిక వేల వరకు ఉంటుందట. అంటే రోజుకు ఈమె పారితోషికం భారీ మొత్తంలోనే పుచ్చుకుంటుంది. ఒక్క రోజుకు ఇంత పారితోషికం దక్కించుకుంటుంది అంటూ చాలా గొప్ప విషయమే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇక మీదట ఈ అమ్మడు హీరో లేదా హీరోయిన్స్ కు అమ్మ గా అక్కగా లేదంటే అత్త పాత్రలో కనిపించే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్ గా నటించాలి అనే పట్టుదలకు పోకుండా భామ కలాపం వంటి సినిమా లు కథలు వస్తే ఒప్పేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి ప్రియమణి సెకండ్ ఇన్నింగ్స్ లో వరుస ఆఫర్లతో పాటు మంచి పారితోషికంతో దూసుకు పోతుంది.
Tags:    

Similar News