పాటల్లో బూతులు- సమాజంపై ప్రభావం

Update: 2016-09-05 17:30 GMT
'జనాల మీద సినిమాల ప్రభావం ఎంతుందో కానీ.. పంచ్ డైలాగుల ప్రభావం మాత్రం గట్టిగా ఉంది' అంటూ ఓ మూవీలో మహేష్ బాబు పంచ్ డైలాగ్ పేల్చుతాడు. కేవలం ఇలాంటి డైలాగ్స్ మాత్రమే కాదు.. జనాలు సినిమా పాటలను కూడా విచ్చలవిడిగా వాడేస్తుంటారు.

ఈ మధ్య కాలంలో హీరోయిన్లను ఏడిపించడం.. మాటలతో వేధించడమే హీరోయిజం అనే టైపు కాన్సెప్ట్ బాగా పెరుగుతోంది. ఇలాంటి సినిమాలు తెగ ఆడేస్తున్నాయి కూడా. వీటినే ఇన్ స్పిరేషన్ గా తీసేసుకున్న ఓ తమిళనాడు కుర్రాడు.. ఓ 16 ఏళ్ల అమ్మాయిని వేధించాడు. తనతల్లితో కలిసి రోడ్డుపై వెళుతున్న సమయంలో.. 'పెళ్లి చేసుకుని పారిపోదామా? పారిపోయి పెళ్లి చేసుకుందామా?' అంటూ అర్ధం వచ్చే పాట పాడ్డమే కాకుండా పబ్లిక్ లో ఆమె చెయ్యి పట్టుకున్నాడు ప్రభుకుమార్. దీంతో కోర్టును ఆశ్రయించింది ఆ బాలిక.

సినిమా పాటను పాడితే అరెస్ట్ చేయడం., జైల్లో పెట్టడం సరికాదని.. వారిద్దరూ ప్రేమికులంటూ వాదించాడు ప్రభుకుమార్ లాయర్. ఈ స్థాయిలో రిమాండ్ అవసరం లేదంటూ బెయిల్ మంజూరు చేసిన ఆ జడ్జ్.. సినీరంగం సమాజంపై చూపుతున్న ప్రభావంపై గట్టి క్లాస్ నే పీకారు. భావితరాల మనసుల్లో మంచి భావాలు కలిగించేలా సినిమాలు ఉండాలని సూచించారు. కానీ ఇప్పుడొస్తున్న సినిమాలు చెడును ప్రేరేపించేలా ఉన్నాయని అగ్రహించారు ఆ న్యాయమూర్తి.
Tags:    

Similar News