మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ కథానాయకులుగా నటించిన `ఆచార్య` ఓటీటీలోకి వచ్చేసింది. ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం అవుతోంది. ఆచార్య గత రాత్రి అమెజాన్ ప్రైమ్ లో ప్రీమియర్ అయ్యింది. థియేటర్లలో వీక్షించని వారికోసం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కోసం అందుబాటులో ఉంది.
ఇద్దరు అగ్ర హీరోలు ప్రధాన పాత్రలలో నటించిన ఈ యాక్షన్ డ్రామాకు కొరటాల శివ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పూజా హెగ్డే- సోనూసూద్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. పెద్ద తెరపై ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ లో ఏ తరహా ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి.
వరుస సినిమాల ట్రీట్ రెడీ ఈ శుక్రవారం క్రేజీ సినిమాలేవీ లేకపోవడంతో OTT విడుదలలకు ఆదరణ పెరుగుతందని అంచనా. RRR- ఆచార్య వంటి పెద్ద సినిమాలతో పాటు పలు ఓటీటీ సిరీస్ ల ప్రీమియర్ లతో సందడి నెలకొంది. SS రాజమౌళి విజువల్ వండర్ RRR ఇటీవలే థియేట్రికల్ రన్‌లో 50 రోజులను విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా చాలా థియేటర్లలో రన్ అవుతోంది. మే 20న OTTలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ చిత్రం Zee5లో ప్రీమియర్ అవుతుంది.మెగాస్టార్ చిరంజీవి ఆచార్య కూడా అదే రోజు అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ అవుతుంది. విడుదలైన మూడు వారాల్లోనే ఆచార్య డిజిటల్ స్పేస్ లో వచ్చేస్తోంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ ట్వల్త్ మ్యాన్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నేరుగా విడుదలకు వస్తోంది. దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మే 6న విడుదలైన శ్రీవిష్ణు తాజా విహారం భళా తందానానా.. మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రదర్శితం కానుంది. ఎస్కేప్ లైవ్- హిందీ వెబ్ సిరీస్ మే 20న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో వస్తుంది. జోంబివిలి మరాఠీ సిరీస్ మే 20నుంచి Zee5లోకి వస్తోంది.
చిప్ ఎన్ డేల్: రెస్క్యూ రేంజర్స్ .. ఇంగ్లీష్ సిరీస్ డిస్నీ+ హాట్‌స్టార్ లో మే 20 నుంచి అందుబాటులోకి వస్తోంది. పంచాయత్ హిందీ వెబ్ సిరీస్ మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో వీక్షకుల కోసం స్ట్రీమింగ్ అవుతుంది. లవ్ డెత్ + రోబోట్స్ సీజన్ 3 మే 20 నుంచి నెట్ ఫ్లిక్స్ లోకి వస్తోంది. నైట్ స్కై సీజన్ 1 ఇంగ్లీష్ వెబ్ సిరీస్.. మే 20 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వస్తోంది. ఓటీటీదే మునుముందు రాజ్యం అనడానికి ఈ ఎగ్జాంపుల్స్ చాలు.