టాలీవుడ్ జక్కన్న రాజమౌళి తెరకెక్కించిన విజువల్ వండర్ ‘బాహుబలి’ చిత్రంలో కొన్ని యాక్షన్ సీన్స్ రియాల్టీకి దూరంగా ఉన్నాయంటూ ట్రోల్స్ వచ్చాయి. ముఖ్యంగా తాటి చెట్లను బలంగా వంచి వాటిపై నిలబడి ఒక్కసారిగా వదిలితే కోట గోడ అవతల పడ్డట్లుగా చూపించారు. తాటి చెట్లను వంచడం సాధ్యమా అలాగే వాటిపై నిల్చుంటూ కోట అవతల పడటం సాధ్యమా అంటూ కొందరు ఆ సమయంలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. కాని తాజాగా ముంబయిలో కనిపించిన ఈ వీడియో బాహుబలి సీన్ రియల్ గా చూసినట్లుగా ఉంది కదా అనిపిస్తుంది.
ముంబయిలో గత కొన్ని రోజులుగా విపరీతమైన వర్షాలు కురుస్తున్నాయి మరియు భీకరమైన గాలులు వీస్తున్నాయి. ఆ గాలుల ధాటికి ఆ ఒక కొబ్బరి చెట్టు బాహుబలి సినిమాలో తాటి చెట్టును ఎంతగా అయితే వంచారో అంతగా వంగింది. కొబ్బరి చెట్టు అంతగా వంగడంను స్థానికులు ఒకరు ఆశ్చర్యం అనిపించి వీడియో తీశారు. ఆ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా అనూహ్యంగా స్పందన వచ్చింది.
ఒక నెటిజన్ వీడియోపై స్పందిస్తూ.. రాజమౌళి గారికి సారీ చెబుతున్నాను. బాహుబలిలో ఇలాంటి సీన్ చూసి ట్రోల్ చేశాను. ఆ సమయంలో జక్కన్నను ఎగతాళి చేసినందుకు ఇప్పుడు ఆయనకు సారీ చెబుతున్నట్లుగా ఆ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇంకా చాలా మంది కూడా రాజమౌళి చూపించింది నిజమే అని దీన్ని చూస్తుంటే అనిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.