బాలీవుడ్ సీనియర్ బ్యూటీ మలైకా అరోరా 49 ఏళ్ళ వయసులో తనకంటే 12 ఏళ్ళు చిన్నవాడైన హీరో అర్జున్ కపూర్ తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే గురువారం మలైకా "నేను 'యస్' అని చెప్పాను" అని ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి ఇంటర్నెట్ ని షేక్ చేసింది. అర్జున్ తనకు పెళ్లి ప్రపోజల్ పెట్టగా.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందేమో అని అందరూ భావించడంతో సోషల్ మీడియాలో వీరి పెళ్లి గురించి వార్తలు వైరల్ అయ్యాయి.
లవ్ బర్డ్స్ మలైకా అరోరా మరియు అర్జున్ కపూర్ ఫైనల్ గా పెళ్ళికి రెడీ అయ్యారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. ఎట్టకేలకు తమ రిలేషన్ ను ముందుకు తీసుకెళ్లడానికి సిద్దమయ్యారంటూ నివేదించారు. దీనిపై అర్జున్ స్పందించకపోవడంతో.. కొందరు నెటిజన్లు మాత్రం ఇదేదో సినిమా గురించి లేదా ఐటెం సాంగ్ గురించి అయ్యుంటుందని గెస్ చేసారు.
మలైకా అరోరా రెండో పెళ్ళికి రెడీ అయిందని భావించిన వారందరినీ ఆమె ఫూల్స్ ని చేసింది. ఎస్ చెప్పింది తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయంలో కాదు.. కెరీర్ గురించి అని అందరికీ అర్థమయ్యేలా ఇంస్టాగ్రామ్ పోస్ట్ తో వచ్చింది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కోసం సీనియర్ బ్యూటీ ఓ కొత్త రియాలిటీ షోకి ఎస్ చెప్పినట్లుగా మెల్లిగా వెల్లడించి షాక్ ఇచ్చింది.
మలైకా హాట్ స్టార్ ఓటీటీ కోసం తొలిసారిగా “మూవింగ్ ఇన్ విత్ మలైకా” అనే పేరుతో ఓ రియాలిటీ షో చేయడానికి సైన్ చేసింది. డిసెంబర్ 5వ తేదీ నుండి ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేయాలని నిర్ణయించడంతో.. హాట్ బ్యూటీ ఇన్స్టాగ్రామ్ లో ఈ పోస్ట్ పెట్టింది.
''నా కొత్త రియాలిటీ షో 'మూవింగ్ ఇన్ విత్ మలైకా' కోసం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కి నేను ఎస్ అని చెప్పాను. ఆగండి.. నేను దేని గురించి మాట్లాడుతున్నానని మీరు అనుకున్నారు? డిసెంబర్ 5 నుండి ప్రసారం అవుతోంది!'' అంటూ దీనికి సంబంధించిన పోస్టర్ ని షేర్ చేసింది.
రియాలిటీ షోకు ఓకే చెప్పి.. పెళ్లి చేసుకోబోతోందని నమ్మించి మలైకా ఆంటీ అందరిని ఫూల్స్ చేసిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ కపూర్ తో తన బంధాన్ని నెక్స్ట్ లెవల్ కు తీసుకెళ్తుందని భావిస్తే.. నిరాశ పరిచిందని మరికొందరు అంటున్నారు. ప్రమోషన్స్ కోసం ఎమోషన్స్ తో ఆడుకుందని ఇంకొందరు వ్యాఖ్యానిస్తున్నారు.
ఏదైతేనేం మధ్యాహ్నం నుంచీ దీని మీదే చర్చ జరగడంతో.. 'మూవింగ్ ఇన్ విత్ మలైకా' షోకి కావాల్సినంత ప్రచారం దొరికింది. వచ్చే నెల నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రాబోతున్న ఈ రియాలిటీ షో.. ఎలాంటి ప్రేక్షకాదరణ పొందుతుందో.. ఇది గార్జియస్ బ్యూటీ కెరీర్ కి ఏ మేరకు హెల్ప్ అవుతుందో చూడాలి.
కాగా, మోడల్ గా ఐటెం భామగా పాపులర్ అయిన మలైకా అరోరా.. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి అర్హాన్ ఖాన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ 2016లో తమ 19 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. గత నాలుగేళ్ల నుంచి అర్జున్ కపూర్ తో సహజీవనం చేస్తోంది అరోరా. ఇప్పుడు ఎస్ చెప్పి పూల్స్ ని చేసిన అరోరా.. త్వరలోనే అందరూ అనుకున్న విషయాన్ని నిజం చేస్తుందేమో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.