అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా అఖిల్ మూడో సినిమా టీజర్ ను ఈరోజే విడుదల చేశారు. 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రచారంలో ఉన్నట్టే 'Mr. మజ్ను' టైటిల్ ను ఖరారు చేసి ఒకేసారి టీజర్ తో పాటు ఆడియన్స్ కు సర్ ప్రైజ్ ఇచ్చారు.
యాభై సెకన్ల టీజర్ లో అక్కినేని చినబాబు స్టైలిష్ ప్లేబాయ్ గా కనిపించాడు. లండన్ వీధుల్లో కాస్ట్ లీ ముస్టాంగ్ కారు నడుపుతూ అల్ట్రా రిచ్ గై అవతారంలో దర్శనమిచ్చాడు. కారు నెంబర్ ప్లేట్ పై ANR8 ఉండడం విశేషం. ఇక బ్యాక్ గ్రౌండ్ లో పాట లిరిక్స్ 'దేవదాసుకు మనవడో.. మన్మధుడికి వారసుడో' అంటూ అక్కినేని లెగసీని అఖిల్ కంటిన్యూ చేస్తున్నట్టుగా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. "ఎక్స్ క్యూజ్ మీ మిస్" అంటూ.. "ఏవిటో ఈ ఇంగ్లీష్ భాష... దేన్నయితే మిస్ చేయకూడదో దాన్నే 'మిస్' అన్నారు" అనే చిలిపి డైలాగ్ ను అంతకన్నా చిలిపి ఎక్స్ ప్రెషన్స్ తో చెప్పాడు.
ఇక అమ్మాయిలతో తిరుగుడే తిరుగుడు.. కాలేజి లో.. బోటులో.. ఇక స్కేట్ బోర్డ్ పై అమ్మాయితో రొమాన్స్ షాట్ సూపరో సూపర్.. (అమ్మాయి కాదు ఇద్దరు అమ్మాయిలు వేర్వేరు షాట్స్ లో అమ్మాయిల డ్రెస్ లు మారాయి గమనించండి). ఈ అక్కినేని రోమియో రచ్చకు లాస్ట్ లో క్యాప్షన్ 'బాయ్స్ విల్ బి బాయ్స్'. నిజమే.. హీరోలందు రొమాంటిక్ అక్కినేని హీరో లు వేరయ్యా!
విజువల్స్.. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ రెండూ బాగున్నాయి. వెంకీ అట్లూరి ఈసారి అక్కినేని లెగసీని బాగానే వాడినట్టు అనిపిస్తోంది. ఓవరాల్ గా అక్కినేని చిన్నోడు పెద్ద టార్గెట్ కొట్టేలానే ఉన్నాడు.. మీరూ ఈ నాటీ ప్లేబాయ్ పై ఓ కన్నేయండి.
Full View