అక్కినేని అఖిల్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'Mr. మజ్ను'. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు. సోమవారం నాడు 'Mr. మజ్ను' ఫుల్ ఆడియో ఆల్బమ్ ను విడుదల చేశారు. వెంకీ అట్లూరి-థమన్ కాంబినేషన్లో తెరకెక్కిన 'తొలిప్రేమ' ఆడియోలోని అన్ని సాంగ్స్ చార్ట్ బస్టర్లుగా నిలిచింది. దీంతో వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న 'Mr. మజ్ను' ఆడియో కోసం మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూశారు.
'Mr. మజ్ను' ఆల్బమ్ లో మొత్తం ఆరుపాటలున్నాయి. ఇందులో 'నేనిలా'.. 'కోపంగా కోపంగా' సాంగ్స్ రెండూ బాగున్నాయి. టైటిల్ సాంగ్ Mr. మజ్ను ట్రెండీగా హీరో క్యారెక్టరైజేషన్ ను వివరిస్తూ ఫన్ టోన్ లో ఉంది. 'ఏమైనదో' స్లోగా సాగే మెలోడీ సిట్యుయేషనల్ గా.. హీరో మనసులోనే బాధను రిఫ్లెక్ట్ చేస్తూ ఎమోషనల్ గా సాగుతుంది. మంచి పిక్చరైజేషన్ తోడైతేమాత్రం ప్రేక్షకులకు నచ్చే అవకాశం ఉంది. 'నాలో నీకు' మంచి లిరిక్స్..ప్లెజెంట్ ఫీల్ ఉన్న మెలోడీ. ఆల్బమ్ లో చివరి సాంగ్ 'చిరు చిరు నవ్వుల' కూడా మంచి ఫీల్ తో ట్రెండీగా సాగుతుంది.
ఓవరాల్ గా ఆల్బమ్ మ్యూజిక్ లవర్స్ ను మెప్పించేదే. 'తొలిప్రేమ' రేంజ్ లో లేదుగానీ 'Mr. మజ్ను' మాత్రం మంచి ఆల్బమ్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ ఏడాదిలో ఇప్పటివరకూ రిలీజ్ అయిన ఆల్బమ్స్ లో మాత్రం ఇదే బెస్ట్. అందులో మాత్రం ఏం అనుమానం లేదు.
Full View