ఎవరి కథ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అనుకున్నది ఒకటైతే జరిగేది మరొకటి అదే జీవితం అంటుంటారు పెద్దలు.. బాలీవుడ్ భామ `జెర్సీ` హీరోయిన్ మృణాల్ ఠాకూర్ విషయంలోనూ అదే జరిగింది. ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా వరుస ఆఫర్లని సొంతం చేసుకుంటున్నారామె. ఇండియన్ సూపర్ హీరో హృతిక్ రోషన్ నటించిన `సూపర్ 30` చిత్రంతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. పరిచయమైన తొలి చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా విమర్శకుల ప్రశంసల్ని కూడా దక్కించుకుంది.
దీంతో మృణాల్ ఠాకూర్ కి బాలీవుడ్ లో తిరుగు లేకుండా పోయింది. `విట్టి దండు` మరాఠీ చిత్రంతో నటిగా కెరీర్ ప్రారంభించినా తనకు పేరు తెచ్చింది మాత్రం `సూపర్ 30`నే. ప్రస్తుతం తెలుగు హిట్ చిత్రం `జెర్సీ`ఆధారంగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్న చిత్రంలో షాహీద్ కపూర్ కు జోడీగా నటిస్తున్న మృణాల్ ఠాకూర్ ఇదే ఏడాది దుల్కర్ సల్మాన్ నటిస్తున్న`లెప్టినెంట్ రామ్` చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతోంది.
`జెర్సీ` రిలీజ్ కి రెడీ అయిన నేపథ్యంలో ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాల్ని వెల్లడించి షాకిచ్చింది మృణాల్ ఠాకూర్. 17 -20 ఏళ్ల వయసు మధ్యలో తాను ఇంటి నుంచి దూరంగా వున్నానని, ముంబై మహా నగరంలో ఒంటరిగా జీవించానని చెప్పుకొచ్చింది. అయితే అది అంతా సులభంగా సాగలేదని, చాలా సార్లు తనకు ఆత్మ హత్య చేసుకోవాలని అనిపించిందని, చదువుకునే రోజుల్లో ఎక్కువగా లోకల్ ట్రైన్ లో ప్రయాణించాల్సి వచ్చేదని, ఆ సమయంలో ట్రైన్ నుంచి దూకేస్తే ఎలా వుంటుందనే ఆలోచనలు వచ్చేవని తెలిపింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ `జెర్సీ`లో శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రలో నటించింది. ఈ సినిమా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని చెబుతోంది. దీంతో పాటు తెలుగులో హను రాఘవపూడి డైరెక్షన్ లో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న `లెఫ్టినెంట్ రామ్` చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. ఇదే కాకుండా తమిళ హిట్ చిత్రం `తడమ్` ఆధారంగా రీమేక్ అవుతున్న హిందీ చిత్రం `గుమ్రా`లోనూ నటిస్తోంది.