టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా ఏదంటే ఠక్కున చెప్పే పేరు 'ఒక్కడు'. మహేష్ బాబు - గుణశేఖర్ కాంబినేషన్ లో వచ్చిన ఫస్ట్ సినిమా ఇది. హైదరాబాద్ లోని పాతబస్తీ - చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా 2003లో సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. మహేష్ బాబుకు ఇది ఏడో సినిమా. నిర్మాత ఏంఎస్ రాజు ఈ సినిమాని నిర్మించగా.. మహేష్ సరసన భూమిక హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమానే మహేష్ బాబుకు స్టార్ డం తీసుకొచ్చింది. అయితే ఈ సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం - మహేష్ బాబు ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగా ఆకట్టుకున్నాయి. హీరోయిన్ భూమికను అమెరికా పంపిద్దాం అనుకున్న మహేష్.. ఆమె కోసం పాస్ పోర్ట్ అప్లయ్ చేస్తాడు. ఆ తర్వాత పాస్ పోర్ట్ తీసుకురావడానికి మహేశ్ - అతని స్నేహితులు కలిసి పాస్ట్ పోర్ట్ ఆఫీస్ కు వెళ్తారు. అక్కడ పాస్ పోర్ట్ ఆఫీసర్ గా పనిచేసే ధర్మవరపు సుబ్రహ్మణ్యం కొత్తగా ఫోన్ కొని మొదటిసారిగా తన ప్రియురాలి గొంతు వినాలని అనుకుంటాడు.
ఇంతలో మహేష్ ఇంకా ఫ్రెండ్స్ మాత్రం సుబ్రహ్మణ్యంకి ఫోన్ చేసి రాంగ్ కాల్ లాగా విసిగిస్తూ ఉంటారు. అయితే ముందుగా సుబ్రహ్మణ్యం తన ప్రియురాలికి కొత్త ఫోన్ నెంబర్ 9848032919 గా చెప్తాడు. అయితే అప్పట్లో ఈ ఫోన్ నెంబర్ ఎవరిదబ్బా.. అని చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కానీ ఎవరికీ తెలియదు. ఇంతకీ ఆ ఫోన్ నెంబర్ ఎవరిది అంటే.. అది ఈ సినిమా నిర్మాత ఎంఎస్ రాజు గారిదేనని సమాచారం. ఆ పాస్ పోర్ట్ ఆఫీస్ సీన్ చేసేటప్పుడు ఎవరి నెంబర్ పెడదాం అని అనుకుంటూ ఉండగా.. ఎవరో సెట్స్ లో నుండి నిర్మాత ఫోన్ నెంబర్ ఇస్తే.. అదిరిపోతుంది అన్నారట. అలా ఆ సీన్ లో నిర్మాత నెంబర్ పెట్టేశారట యూనిట్. సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ఆ సీన్లు కూడా బాగా పాపులర్ కావడంతో నంబర్ కూడా బాగా పాపులర్ అయింది. ఈ దెబ్బతో నిర్మాతకి రోజు వందల ఫోన్ కాల్స్ వచ్చేవట. ఆ గోల భరించలేక ఎంఎస్ రాజు నెంబర్ తో పాటు ఫోన్ కూడా మార్చేసారట. అలా ఒక్కడు సినిమాతో పాటు పాపులర్ అయినవీ చాలానే ఉన్నాయి.. అందులో ఒకటి ఈ ఫోన్ నెంబర్!