రేసింగ్ నేపథ్యంలో సినిమాలున్నాయి. జాంబీ తరహా ప్రయోగాలు చేస్తున్నారు. కానీ వాటికి భిన్నంగా మడ్ రేస్ మూవీని తెరపైకి తేవడం ఆసక్తికరం. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆఫ్-రోడ్ మడ్ రేస్ చిత్రం `మడ్డీ` అంటూ ప్రచారం చేస్తోంది చిత్రబృందం. ఈ చిత్రం ద్వారా డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పికె 7 క్రియేషన్స్ పతాకంపై ప్రేమ కృష్ణదాస్ నిర్మించారు. ఈ చిత్రాన్ని సౌత్ అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
తాజాగా మోషన్ పోస్టర్ ని విడుదల చేశారు. ``ఇదో విజువల్ గ్రాండియర్ మూవీ. ఈ మూవీ టీజర్ ను ఈ నెల 26న విడుదల చేస్తాం. రియలిస్టిక్ యాక్షన్ రేసింగ్ తో పాటు అన్ని కమర్షియల్ హంగులతో మడ్డీ చిత్రం రూపొందింది. ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ పని చేశారు. ఆఫ్ రోడ్ రేసింగ్ క్రీడల గురించి సినిమా పరంగా ఎంతో రీసెర్చ్ చేసి ఈ చిత్రాన్ని రూపొందించాం. షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది`` అని దర్శకనిర్మాతలు తెలిపారు.
రవి బస్రూర్ సంగీతం అందించిన ఈ చిత్రానికి శాన్ లోకేష్ ఎడిటర్. హాలీవుడ్ ఫేమ్ కె జి రతీష్ సినిమాటోగ్రఫీ అందించారు. పాపులర్ నటులు సాంకేతిక నిపుణులు పని చేసిన ఈ మడ్ రేసింగ్ యాక్షన్ ఫిల్మ్ కి పని చేశారు. యువన్- రిధాన్ కృష్ణ- అనుషా సురేష్- అమిత్ శివదాస్ నాయర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో హరీష్ పెరాడి- ఐ ఎం విజయన్ - రెంజీ పానికర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.