ట్రెండ్‌గా మారుతున్న మ‌ల్టీవ‌ర్స్ ల గోల‌!

Update: 2022-12-10 00:30 GMT
ద‌క్షిణాదిలో పాన్ ఇండియా సినిమాల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ప్ర‌తీ స్టార్ హీరో నుంచి యంగ్ హీరో వ‌ర‌కు ప్ర‌తీ ఒక్క‌రూ ఇప్ప‌డు పాన్ ఇండియా జ‌పం చేస్తున్నారు. ప్ర‌భాస్ నుంచి నిఖిల్ వ‌ర‌కు వ‌రుస పాన్ ఇండియా సినిమాల‌తో బిజీ బిజీగా గ‌డిపేస్తున్నారు. ఇప్ప‌డు కొత్త‌గా సినిమాటిక్ యూనివ‌ర్స్ ట్రెండ్ వినిపిస్తోంది. హాలీవుడ్ లో మార్వెల్ సిరీస్ సినిమాల‌కు మాత్ర‌మే సినిమాటిక్ యూనివ‌ర్స్‌ మ‌ల్టీవ‌ర్స్ అనే ట్రెండ్ ప‌రిమితం అవుతూ వ‌స్తోంది.

ఇప్పుడ‌ది మ‌న భార‌తీయ సినిమాల‌కు మ‌రీ ప్ర‌ధానంగా ద‌క్షిణాది సినిమాల‌కు పాక‌డం హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ త‌ర‌మా సినిమాల‌ని ప్రేక్ష‌కులు రికార్డు స్థాయిలో ఆద‌రిస్తుండ‌టం.. మిగ‌తా సినిమాల‌తో పోలిస్తే అత్యంత ఆస‌క్తిని క‌న‌బ‌రుస్తుండ‌టంతో చాలా మంది ద‌ర్శ‌కులు ఈ త‌ర‌హా సినిమాటిక్ మ‌ల్టీవ‌ర్స్ యూనివ‌ర్స్ క‌థ‌ల‌ను సృష్టించాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టికే లోకేష్ క‌న‌గ‌రాజ్ వంటి కొంత మంది ద‌ర్శ‌కులు ఈ త‌ర‌హా క‌థ‌లతో సినిమాలు చేయ‌డానికి రెడీ అయిపోతున్న విష‌యం తెలిసిందే.

క‌మ‌ల్ హాస‌న్ తో తెర‌కెక్కించిన `విక్ర‌మ్‌` బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని సినిమాటిక్ యూనివ‌ర్స్ నేప‌థ్యంలో మ‌ల్టీవ‌ర్స్ గా తెర‌పైకి తీసుకురావాల‌ని లోకేష్ క‌న‌గ‌రాజ్ ప్లాన్ చేసిన విష‌యం తెలిసిందే. అందులో భాగంగానే `విక్ర‌మ్‌`లో కార్తి `ఖైదీ`ని ఇందులో ఇన్ వాల్వ్ చేయ‌డం తెలిసిందే. త్వ‌ర‌లో విజ‌య్ హీరోగా తెర‌కెక్కించ‌బోతున్న ఈ మూవీని `విక్ర‌మ్‌`లో భాగంగానే రూపొందించ‌బోతున్నాడ‌ని, ఇందులో క‌మ‌ల్ గెస్ట్ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఇక `కేజీఎఫ్‌` యూనివ‌ర్స్ లో భాగంగా ప్ర‌భాస్ తో తెర‌కెక్కిస్తున్న `స‌లార్‌`ని ప్ర‌శాంత్ నీల్ రూపొందిస్తున్నాడ‌ని, `కేజీఎఫ్ 2` లో క‌నిపించ‌కుండా పోయిన ఫ‌ర్మాన్ పాత్రని స‌లార్ గా మార్చి రూపొందిస్తున్నాడ‌ని, ఇది కేజీఎఫ్ యూనివ‌ర్స్ లో ఓ భాగంగా రూపొందుతోందని, `స‌లార్` ఇందులో భాగంగానే రెండు భాగాలుగా రానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇదే పంథాలో `హిట్`ని కూడా ప్లాన్ చేస్తున్నాడ‌ట శైలేష్ కొల‌ను.

ఇప్ప‌డు ఇదే ఆలోచ‌న‌తో `పుష్ప 2` ని కూడా సినిమాటిక్ మ‌ల్టీవ‌ర్స్ లో భాగంగా తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ని, ఇందులో రామ్ చ‌ర‌ణ్ చిట్టి బాబు క్యారెక్ట‌ర్ ని ఎంట‌ర్ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఇవ‌న్నీ అఫీషియ‌ల్ గా అనౌన్స్ అయితే ఇదే పంథాలో మ‌రి కొంత మంది ద‌ర్శ‌కులు కూడా మ‌ల్టీవ‌ర్స్ ని క్రియేట్ చేయ‌డం ఖాయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News