డ్ర‌గ్స్ నుంచి ముమైత్ కి రిలీఫ్‌..!

Update: 2019-04-05 17:39 GMT
2017లో టాలీవుడ్ ని డ్ర‌గ్స్ స్కాండ‌ల్ పెద్ద ఎత్తున‌ ఊపేసిన సంగ‌తి తెలిసిందే. ఆ స‌మ‌యంలో హైద‌రాబాద్ న‌గ‌రంలో డ్ర‌గ్స్ లోగుట్టు బ‌య‌ట‌ప‌డింది. సిట్ ద‌ర్యాప్తు లో ప‌లువురు టాలీవుడ్ సెల‌బ్రిటీల పేర్లు ప్ర‌ముఖంగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఆ టైమ్ లోనే ఐటెమ్ గాళ్ ముమైత్ ఖాన్ పేరు ప్ర‌ముఖంగా వినిపించింది. సిట్ విచార‌ణ‌కు ముమైత్ హాజ‌ర‌య్యారు. ఓవైపు బిగ్ బాస్ హౌస్ లో పార్టిసిపెంట్ గా ఉన్న ముమైత్ ని సిట్ ద‌ర్యాప్తు సంస్థ ఇన్వెస్టిగేష‌న్ పేరుతో పిల‌వ‌డంతో ఆ సంగ‌తి జాతీయ స్థాయిలో చ‌ర్చ‌కు వ‌చ్చింది. టాలీవుడ్ లో డ్ర‌గ్ దందాపై మీడియాలోనూ ప‌లు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వెలువ‌డ్డాయి. హైద‌రాబాద్ న‌గ‌రంలోని ప‌బ్బులు, క్ల‌బ్బుల్లో ప్ర‌మాద‌క‌ర కొకైన్ .. ఎల్ ఎస్డీ, ఎండిఎం వంటి మాద‌క‌ద్ర‌వ్యాల చెలామ‌ణి సాగుతోంద‌ని ద‌ర్యాప్తులో నిగ్గు తేల్చారు. ముమైత్ ఇందులో ఇన్వాల్వ్ అయ్యార‌ని.. ఎన్ డిపిఎస్ యాక్ట్- సెక్ష‌న్ 67 ప్ర‌కారం నోటీసులు జారీ చేసింది సిట్. ప‌లు ద‌ఫాలు త‌న‌పై సిట్ విచార‌ణ సాగించింది.

అదంతా గ‌తం అనుకుంటే వ‌ర్త‌మానంలో ఆ హ‌డావుడి కాస్తా స‌ద్ధుమ‌ణిగిన సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్ ప్ర‌శాంతంగా ఉందిప్పుడు. మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం నుంచి ముమైత్ బ‌య‌ట‌ప‌డ‌డం ఆస‌క్తిక‌రం. ప్ర‌స్తుతం ముమైత్ ఏం చేస్తున్నారు? అంటే తిరిగి య‌థావిధిగా న‌ట‌జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో `హెజా` అనే ఓ మ్యూజిక‌ల్ హార‌ర్ ఆల్బ‌మ్ లో న‌టిస్తున్నారు. మున్నా కాశీ దీనికి సంగీతం అందించ‌డ‌మే గాక‌ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఇది ఓ రియ‌ల్ స్టోరి! అంటూ ప్ర‌చారం చేస్తున్నారు. ముమైత్ అందుకు సంబంధించిన పోస్ట‌ర్ ని త‌న అధికారిక ఇన్ స్టాగ్ర‌మ్ లో షేర్ చేశారు.

ప్ర‌స్తుతం ముమైత్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తున్నార‌ని సామాజిక మాధ్య‌మాల్లో పోస్ట్ చేసిన కొన్ని ఇమేజెస్ చెబుతున్నాయి. త‌న చుట్టూ అల‌వాటైన‌ ప‌రిస‌రాలు .. ఆ ప‌రిస‌రాల‌తో వ‌చ్చే కొన్ని ప‌రిణామాలు అన్నిటినీ ఎదుర్కొని.. కొన్నిటిని జ‌యించి ముమైత్ స్వ‌యంకృషితో ఎదిగార‌నేది ఇన్ స్టాలో పోస్టులు చెబుతున్నాయి. పీస్.. హ్యాపీనెస్.. ఎయిమ్.. పాజిటివిటీ ని ముమైత్ ఎక్కువ ఇష్ట‌ప‌డ‌తార‌ని ఇన్ స్టాలో ర‌క‌ర‌కాల కొటేష‌న్స్ ని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. ``యాన్ ఎయిమ్ ఇన్ లైఫ్ ఈజ్ ది ఓన్లీ ఫార్ట్యూన్ వ‌ర్త్ ఫైండింగ్` అంటూ రాబ‌ర్ట్ లూయిస్ స్టీవెన్స‌న్ కోట్ ని ముమైత్ షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.
Tags:    

Similar News