టాలీవుడ్ లో ఐటెం సాంగ్స్ కు.. ఐటెం భామలకు రోజులు చెల్లిపోయిన కాలం అంది. సిల్క్ స్మిత - డిస్కోశాంతి జనరేషన్ తర్వాత.. కొత్తగా ఎవరూ ఐటెం గాళ్స్ గా ఆ రేంజ్ లో అలరించలేకపోయారు. ముమైత్ ఖాన్ ఎంట్రీ తర్వాత సీన్ మారిపోయింది. పోకిరి మూవీలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారు' అంటూ ముమైత్ వేసిన స్టెప్పుల తర్వాత.. తెలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ కంపల్సరీ అయిపోయింది. అయితే.. ఈ పాటలో ఛాన్స్ ఇచ్చిన పూరీతో ముమైత్ కి అఫైర్ ఉందనే రూమర్స్ వినిపించేవి.
ఇలాంటి రూమర్స్ పై ఏళ్ల తరబడి సైలెంట్ గానే ఉన్న ఈ ఐటెం గాళ్.. ఇప్పుడు వివరణ ఇచ్చింది. 'పూరీ జగన్నాథ్ తో నాకు అఫైర్ ఉందనేవన్నీ రూమర్స్ మాత్రమే. పోకిరి చేసినప్పటి నుంచి ఆయనతో మంచి స్నేహం కుదిరింది. కాస్త క్లోజ్ గా ఉంటే ఇలాంటి ఎఫైర్ వార్తలు రావడం సహజమే. అందుకే వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇలా ప్రచారం మొదలైనప్పుడల్లా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఇలా చేస్తే టైమ్ వేస్ట్ తప్ప ఉపయోగం ఉండదు' అని చెప్పింది ముమైత్ ఖాన్.
తెలుగు-హిందీ-తమిళ్-కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసిన ముమైత్ ఖాన్.. రీసెంట్ గా తిక్క మూవీలో కూడా కనిపించింది. అవకాశాలు ఈ మధ్య బాగా తగ్గాయన్న మాట వాస్తవమే అయినా.. మళ్లీ తిరిగి సత్తా చాటుతానంటోంది ముమైత్.