టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ రాకెట్ విచారణలో భాగంగా నోటీసులు అందుకున్న సినీ ప్రముఖులు సిట్ విచారణకు హాజరవుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహరంలో నోటీసులు అందుకున్న నటి ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షోలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆమె సిట్ విచారణకు హాజరవుతారా? లేదా? అన్న సందేహాలు వచ్చాయి. అయితే, ఆ షో నిర్వాహకుల నుంచి ప్రత్యేక అనుమతి తీసుకున్న ముమైత్ ఖాన్ ఈ రోజు సిట్ విచారణకు హాజరయ్యారు. ఆమె వెంట బిగ్ బాస్ షో నిర్వాహకులు సిట్ కార్యాలయానికి వచ్చారు. విచారణ సందర్భంగా ఆమె పలు కీలకమైన విషయాలు వెల్లడించినట్లు పలు చానెళ్లలో వార్తలు వచ్చాయి. నటి ఛార్మి తరహాలోనే ముమైత్ ఖాన్ ను కూడా మహిళా అధికారులే విచారించారు.
ముమైత్ ఖాన్ ను సిట్ అధికారులు ఉదయం 10 గంటల నుంచి విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు నలుగురు మహిళా అధికారులతో ఏర్పాటుచేసిన విచారణ బృందం ఆమెను సుమారు ఆరు గంటలపాటు విచారించింది. సినీ పరిశ్రమలోకి మీరు ఎలా ఎంటరయ్యారు? మీరు డ్రగ్స్ తీసుకుంటారా? వారంతాల్లో ఎలా గడుపుతారు? పబ్ లకు తరచూ వెళ్తుంటారా? సినీ పరిశ్రమలోకి రాకముందు ఏం చేసేవారు? పబ్ లకు వెళ్తుంటారా? తరుణ్, నవదీప్ పబ్ లకు ఎన్నిసార్లు వెళ్లారు? ముంబై నుంచి హైదరాబాదుకు కేవలం షూటింగ్స్ కోసమే వచ్చేవారా? అని ముమైత్ పై సిట్ అధికారులు ప్రశ్నల వర్షం కురిపించినట్లు చానెళ్లలో వార్తలు వచ్చాయి.
దర్శకుడు పూరీ జగన్నాథ్ తో పోకిరి సినిమాకు ముందే పరిచయం ఉందా? ఎక్కువ ఐటెం సాంగ్స్ లో నటించే మీరు..చిత్ర యూనిట్ తో విదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఏంటి? డ్రగ్స్ తీసుకున్నారా? డ్రగ్స్ సరఫరా చేసేవారా? హైదరాబాదును విడిచి ముంబై ఎందుకు వెళ్లారు? ప్రతినెలా జరిగే గోవా ఫెస్టివల్స్ కు హాజరయ్యేందుకు కారణం ఏంటి? తదితర ప్రశ్నలతో ముమైత్ ను అధికారులు ఉక్కిరిబిక్కిరి చేసినట్లు పలు చానెళ్లలో వార్తలు వచ్చాయి.
డ్రగ్స్ ముఠా నాయకుడు కెల్విన్ తో ఆమెకు ఉన్న పరిచయాలపైనే ఆరా తీసినట్టు తెలుస్తోంది. అతడి సెల్‌ఫోన్‌లో ముమైత్‌ఖాన్ ఫోన్ నంబర్ ఉండటంతో పాటు వీరిద్దరి మధ్య వాట్సాప్ చాటింగ్ వివరాలకు సంబంధించిన అంశాలను సైతం అధికారులు సేకరించినట్టు సమాచారం. ఛార్మి తరహాలోనే ముమైత్ విచారణను కూడా సాయంత్రం 5గంటలలోపే అధికారులు ముగించారు. విచారణ అనంతరం ఆమె తిరిగి బిగ్ బాస్ సిబ్బందితో కలిసి వెనుదిరిగే సమయంలో విక్టరీ సింబల్ చూపిస్తూ వెళ్లడం గమనార్హం. మళ్లీ తిరిగి ఆమె బిగ్ బాస్ హౌస్ కు వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఎవరినీ కలవకుండా, కనీసం ఆమెకు ఫోన్ కూడా అందుబాటులో లేకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు జాగ్రత్తపడ్డారు.