అప్పుడు నేను చేసిందే ఇప్పుడు స్టార్‌ లు చేస్తున్నారుః ముమైత్‌

Update: 2021-05-11 09:30 GMT
తెలుగు ప్రేక్షకులకు ఐటెం సాంగ్స్ అంటే గుర్తుకు వచ్చే పేర్లు జయమాలిని జ్యోతి లక్ష్మి... ఆ తర్వాత జనరేషన్‌ వారికి సిల్క్‌ స్మిత.. డిస్కో శాంతి ఇక కొన్ని సంవత్సరాల క్రితం వారికి ఐటెం సాంగ్ అంటే ముమైత్ ఖాన్‌ గుర్తుకు వచ్చేదనడంలో సందేహం లేదు. ఇప్పుడు ప్రేక్షకులు ఐటెం సాంగ్స్ అంటే ఠక్కున గుర్తు చేసుకునేందుకు ఎవరు లేరు. ఎందుకంటే హీరోయిన్స్‌ పలువురు కూడా ఐటెం సాంగ్స్ చేస్తున్నారు. తాజాగా ఆ విషయమై ముమైత్‌ ఖాన్‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.

ఇప్పటికింకా నావయసు.. అంటూ ముమైత్ ఖాన్‌ చేసిన డాన్స్‌ తో దాదాపు పదేళ్ల పాటు ఇండస్ట్రీలో ఒక ఊపు ఊపేసింది. కాని ఈమద్య కాలంలో మాత్రం ఆమెకు ఆఫర్లు రావడం లేదు. దాంతో డాన్స్ షోల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తోంది. డాన్స్ ప్లస్ లో జడ్జ్‌ గా వ్యవహరిస్తున్న ముమైత్‌ ఖాన్‌ కొన్ని విషయాల్లో మరీ బోల్డ్‌ వ్యాఖ్యలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తోంది. ముమైత్ మెంటర్ గా వ్యవహరిస్తున్న టీమ్‌ సిల్క్‌ స్మిత పాటకు డాన్స్ చేశారు. ఆ సమయంలో ముమైత్‌ కన్నీరు పెట్టుకుంది.

తనకు సిల్క్ స్మిత అంటే ఇష్టం.. ఆమె ఇన్సిపిరేషన్‌ తోనే నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. గతంలో నేను స్పెషల్‌ సాంగ్స్ చేసిన సమయంలో కొందరు నన్ను తీవ్రంగా విమర్శించే వారు. కాని ఇప్పుడు స్టార్‌ హీరోయిన్స్ ఆ స్పెషల్‌ సాంగ్స్ చేస్తూ ఉంటే వాటిని చూసి ఎంజాయ్‌ చేస్తున్నారంటూ ఎమోషనల్‌ అయ్యింది. ముమైత్‌ ఖాన్‌ స్టార్‌ హీరోయిన్స్ ఐటెం సాంగ్స్ ను చేస్తున్నారంటూ ఇండైరెక్ట్‌ గా కౌంటర్ వేసింది. ఇప్పుడు వారు చేస్తుంటే ఎంజాయ్‌ చేసిన కొందరు మమ్ములను మాత్రం విమర్శించే వారు అంటూ ఆలోచింపజేసే విధంగా వ్యాఖ్యలు చేసింది.
Tags:    

Similar News